Uncooked Fish Or Dry Fish: ఎండు చేపలు Vs పచ్చి చేపలు రెండింటిలో ఏది బెస్ట్..

Written by RAJU

Published on:

Raw Fish Or Dry Fish: చేపలు పోషకాహార నిలయాలు. వీటిని మన ఆహారపు అలవాట్లలో భాగం చేసుకుంటే శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. అయితే, మనం ఆహారంలో చేపలను రెండు రకాలుగా తీసుకుంటాం. కొందరికి పచ్చిచేపలతో వండిన వంటకాలు బాగా నచ్చితే మరికొందరికి ఎండబెట్టిన చేపలతో చేసిన పదార్థాలు నచ్చుతాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేపలను పచ్చిగా తినాలా.. ఎండబెట్టి తినాలా.. రెండింటిలో ఏవి బెస్ట్ అనే సందేహం వచ్చింది కొందరు పరిశోధకులకు. రకరకాల ప్రయోగాలు తర్వాత చివరికి ఈ విషయం కనుగొన్నారు.

వాస్తవానికి చేపల్లో రెండు వర్గాలున్నాయి. ఉప్పు నీటిలో పెరిగేవి. మంచి నీటిలో పెరిగేవి. మనకు ఎక్కువగా చేపలు లభించేంది సముద్రం నుంచే. నదులు, సరస్సులతో పోల్చితే సముద్రం నుంచి సేకరించే చేపల్లో పోషకాలు మెండు. ఈ చేపలను తాజాగా తింటే ఆరోగ్యానికి మంచిదా.. ఎండిన తర్వాత తింటే మంచిదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చి చేపలు :

పచ్చిచేపల్లో లీన్ ప్రోటీన్లు,ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఏ, బి12, డీ,కే విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాల్షియం, అయోడిన్, కాపర్ వంటి ఖనిజాలు, సెలీనియం అధిక మోతాదులో ఉంటాయి. ముఖ్యంగా గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక స్థాయిలో కలిగి ఉంటాయి. ఇవి వాపు, రక్తపోటు సమస్యలు తగ్గిస్తాయి. ఎండుచేప కంటే తాజా చేపల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అయితే, కొందమందికి వీటి వాసన సరిపోదు. తిన్నా అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. వీటిని ఇష్టంగా తినేవాళ్లు ఈ విషయం తప్పక గుర్తుంచుకోవాలి. పచ్చి చేపలను సరిగ్గా శుభ్రం చేసుకుని వండుకోకపోతే ఇందులోని బ్యాక్టీరియా కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. పచ్చి చేపలను తాజాగా ఉన్నప్పుడే తీసుకోకపోతే లేనిపోని అనారోగ్య సమస్యలు రావచ్చు.

ఎండు చేపలు :

పచ్చి చేపల్లో ఉన్నంత స్థాయిలో కాకపోయినా డ్రై ఫిష్‌లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, పోషకాలు ఉంటాయి. ఎండబెట్టిన తర్వాత వీటిలోని నీటి శాతం తగ్గడం వల్ల ఎండు చేపల్లో పోషకాలన్నీ ఒక్కచోటకు చేరతాయి. ఎంతలా అంటే కిలో పచ్చిచేపల్లో 200 గ్రాముల ప్రొటీన్ ఉంటే కిలో డ్రై ఫిష్‌లో సుమారు 600 గ్రాములు ఉంటుంది. ఎముకలను దృఢంగా చేసే కాల్షియం స్థాయి అధికంగా ఉంటుంది గనకే అథ్లెట్లు, బాడీ బిల్డర్లు ఆహారంలో ఎండుచేపలనే ఎక్కువగా భాగం చేసుకుంటారు. ఇవి కండరాలు, గుండె, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడేందుకు సహాయపడతాయి. మరో విషయం ఏంటంటే వీటిలో సోడియం కంటెంట్ పచ్చిచేపల కంటే అత్యధికంగా ఉంటుంది. ఉప్పు కలిపి ఎండబెట్టినపుడు నీటితో సంబంధం ఉన్న ప్రొటీన్ల శాతం తగ్గుతుంది. చాలా కాలం నిల్వ ఉండే వీటిని ఎప్పుడు తిన్నా ఏ సమస్య రాదు. ఎక్కువ వాసన కూడా వేయదు. పచ్చి చేపల వాసన సరిపడని వారికి ఎండుచేపలు బెస్ట్ ఛాయిస్.

పచ్చి చేపలు, ఎండు చేపలు రెండింటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలుంటాయి. దేని ప్రయోజనాలు దానికుంటాయి అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

Read Also : Diabetes Control Tips: 5 రోజువారీ అలవాట్లతో షుగర్ సహజంగా అదుపులోకి..

Skincare : అబ్బాయిలూ.. ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ మెరిసిపోతుంది.. ఎప్పటికీ యంగ్‌గా ఉంటారు..

Alcohol Drinking : మద్యం అలవాటు పోవాలంటే.. ఈ ఒక్క డ్రింక్ చాలు..

Subscribe for notification