UGC NET 2025 Notification: యూజీసీ నెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ రాత పరీక్ష తేదీలివే!

Written by RAJU

Published on:

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో పీహెచ్‌డీ ప్రవేశాలతోపాటు జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌), యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఏటా రెండు సార్లు జూన్‌, డిసెంబర్‌ నెలల్లో యూజీసీ నెట్‌ పరీక్షను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాదికి జూన్‌ సెషన్‌కు యూజీసీ- నెట్‌ నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జారీ చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్ 16 నుంచే ప్రారంభమైనాయి. మే , 2025వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. మే 9 నుంచి 10 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్‌(ఓసీ) అభ్యర్థులు రూ.1150, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ, అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్‌ జెండర్‌ అభ్యర్థులు రూ.325 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇక ఆన్‌లైన్ రాత పరీక్షలు జూన్‌ 21 నుంచి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తన ప్రకటనలో వెల్లడించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో అభ్యంతరాలు ఉన్నవారు 011-40759000 లేదా 011-69227700 ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే యూజీసీ అధికారిక వెబ్‌సైట్‌ ugcnet@nta.ac.inను సంప్రదించవచ్చు.

అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్‌ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, హోం సైన్స్‌, హిస్టరీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇండియన్‌ కల్చర్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌, మ్యూజిక్‌, సైకాలజీ, లా, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు వంటి తదితర సబ్జెక్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ- ఎన్‌సీఎల్‌/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. జేఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకునే వారికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి ఉండదు.

ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. పేపర్‌ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. పేపర్‌ 1లో రీజనింగ్‌ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌పై ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

యూజీసీ – నెట్ 2025 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights