Women Empowerment Program : మహిళలు రూ.3 లక్షల వరకు రుణం పొంది.. 88 రకాల చిన్న చిన్న వ్యాపారాలు నెలకొల్పుకొని ఆర్థికంగా స్థిరపడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ఈ ఉద్యోగిని పథకం (Udyogini Scheme).

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే Udyogini Scheme లక్ష్యం :
కేంద్ర ప్రభుత్వం (Government of India) ఆత్మనిర్భర్ కార్యక్రమ లక్ష్యాల్లో మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం ఆర్థిక సహాయం అందించడమూ ఒకటి. మహిళలు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగి తమ కాళ్లపై తాము నిలదొక్కుకోవడానికి ప్రవేశపెట్టిన పథకమే ఉద్యోగిని (Udyogini Scheme). ఈ పథకాన్ని మొదట కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ.. తరువాత కేంద్ర ప్రభుత్వం దీన్ని వుమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో దేశమంతటా అమలు చేస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 48 వేల మంది మహిళలు లబ్ధి పొంది చిన్నపాటి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Sukanya Samriddhi Yojana : మీ పాపకి 21 ఏళ్లు వచ్చేసరికి చేతికి రూ.64 లక్షలు.. ఆడపిల్లల చదువు, వివాహానికి అద్భుతమైన స్కీమ్ ఇదే.. నెలకు ఎంత కట్టాలంటే..?
Udyogini Scheme – వడ్డీ విషయానికొస్తే..?
వైకల్యం ఉన్నవారు, వితంతువులు, దళిత మహిళలకు పూర్తిగా వడ్డీ లేని రుణం కల్పిస్తారు. మిగిలిన వర్గాలకు చెందిన మహిళలకు 10 శాతం నుంచి 12 శాతం వడ్డీ మీద రుణం ఇస్తారు. ఈ వడ్డీ అనేది ఆ మహిళ రుణం పొందే బ్యాంకు నిబంధనలను బట్టి ఉంటుంది. అలాగే.. కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి 30 శాతం వరకూ సబ్సిడీ కల్పిస్తారు.
Udyogini Scheme – ఎవరు అర్హులంటే..?
18 సంవత్సరాలు నిండిన 55 సంవత్సరాల వయసులోపు మహిళలందరూ అర్హులే.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలు తమ క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ బాగా ఉండేలా చూసుకోవాలి.
గతంలో ఏదైనా రుణాలు తీసుకుని సరిగ్గా తిరిగి చెల్లించకుండా ఉన్నట్లయితే రుణం ఇవ్వరు.
Udyogini Scheme – ఈ డాక్యుమెంట్లు సమర్పించాలి :
- పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు జత చేయాలి
- దరఖాస్తు చేస్తున్న మహిళ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం
- దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు రేషన్ కార్డు కాపీని జతపరచాలి.
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- బ్యాంకు ఖాతా పాసు పుస్తకం తదితర డాక్యుమెంట్లు సమర్పించాలి.
గమనిక: Udyogini Scheme కింద రుణం పొందడానికి మహిళలు తమ ప్రాంతంలోని బ్యాంకులను సంప్రదించాలి. బజాజ్ ఫైనాన్స్ లాంటి ప్రైవేటు ఆర్థిక సంస్థలు కూడా Udyogini Scheme కింద రుణాలు ఇస్తున్నాయి.