two-time-heavyweight-champion-george-foreman-dies-at-age-76 – NTV Telugu

Written by RAJU

Published on:


  • ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మెన్ (76) మృతి
  • శుక్రవారం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడి.
two-time-heavyweight-champion-george-foreman-dies-at-age-76 – NTV Telugu

ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మెన్ (76) మృతి చెందారు. శుక్రవారం కన్నుమూసినట్లు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “మా హృదయాలు బద్దలయ్యాయి. తీవ్ర దుఃఖంతో, మా ప్రియమైన జార్జ్ ఎడ్వర్డ్ ఫోర్‌మాన్ సీనియర్ మరణాన్ని ప్రకటిస్తున్నాము” అని కుటుంబ సభ్యులు ప్రకటనలో పేర్కొన్నారు. “అతను ఒక భక్తిపరుడైన బోధకుడు, అంకితభావం కలిగిన భర్త, ప్రేమగల తండ్రి, గర్వించదగిన తాత మరియు ముత్తాతగా తన జీవితాన్ని గడిపాడు. అచంచలమైన విశ్వాసం, వినయం మరియు ఉద్దేశ్యంతో జీవించాడు” అని ఫోర్‌మాన్ కుటుంబం చెప్పారు.

Read Also: Minister Narayana: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పార్కులు నిర్వీర్యమయ్యాయి..

1968 ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలవడంతో పాటు రెండుసార్లు హెవీ వెయిల్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు. తన కెరీర్‌లో 68 నాకౌట్లలో పాల్గొనగా ఐదింట్లో మాత్రమే ఓటమి పాలయ్యారు. 1977లో బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రముఖ బాక్సర్ మహమ్మద్ అలీతో 1974లో జరిగిన పోరులో ఓటమి పాలయ్యారు. అతని జీవితం అనేక మందికి ప్రేరణగా నిలిచింది. 1990లలో బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫోర్‌మాన్.. తర్వాత వ్యాపార రంగంలోకి వెళ్లాడు. గృహోపకరణ ఉత్పత్తులను ప్రమోషన్ చేస్తూ, సాల్టన్ ఇంక్ నుండి ఎలక్ట్రిక్ గ్రిల్‌ను ప్రచారం చేయడంలో తన ప్రతిభను చూపించాడు. ఆయన జీవితం కేవలం బాక్సింగ్ ప్రపంచంలో మాత్రమే కాదు, వ్యాపార రంగంలో కూడా ప్రతిష్టాత్మకంగా నిలిచింది. జార్జ్ ఫోర్‌మాన్ అనేది కేవలం ఒక బాక్సింగ్ అగ్రగామి కాకుండా.. ఒక గొప్ప వ్యక్తి కూడా. ఆయన అందించిన స్ఫూర్తి, మానవతా సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

Subscribe for notification