Two killed in automotive collision in Jaipur

Written by RAJU

Published on:

  • రాజస్థాన్‌లోని జైపూర్‌లో కారు బీభత్సం
  • ఇద్దరు మృతి.. 9 మందికి గాయాలు
Two killed in automotive collision in Jaipur

రాజస్థాన్‌లోని జైపూర్‌లోని నహర్‌గఢ్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఎస్‌యూవీ వాహనం బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్.. 80 కి.మీ వేగంతో కారు జనాలపైకి దూసుకెళ్లింది. అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా.. మరో తొమ్మిది తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జైపూర్‌లోని నహర్‌గఢ్ ప్రాంతం. సోమవారం రాత్రి 9 గంటలు. రహదారిలో జనాలు వెళ్తూ వస్తున్నారు. ఇంతలోనే ఎస్‌యూవీ వాహనం వేగంగా జనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదస్థలిలోనే ఇద్దరు చనిపోయారు. అయితే డ్రైవర్ వాహనాన్ని నిలపకుండా వేగంగా దూసుకెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ను పట్టుకునేందుకు స్థానికులు పరుగున వెళ్లారు.. కానీ అప్పటికే దాటి పోయాడు.

ప్రమాదంపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. హృదయ విదారకంగా ఉందని వ్యాఖ్యానించారు. నిందితులపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారిలో మూడేళ్ల బాలిక కూడా ఉందని బీజేపీ ఎమ్మెల్యే బాల్ముకుంద్ ఆచార్య అన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights