Tummala: ఇందూరులో వ్యవసాయ వర్సిటీ! | TG Leads in Farmer Welfare Claims Minister Tummala Nageshwar Rao

Written by RAJU

Published on:

జపాన్‌ పర్యటన నుంచి సీఎం రాగానే నిర్ణయం.. అన్ని జిల్లాల్లో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీలు పెడతాం

  • మార్చి 31 వరకు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేశాం

  • మిగిలిన వారికి త్వరలో వేస్తాం : తుమ్మల

  • ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీల పెండింగ్‌ పనులు ప్రారంభిస్తాం: ఉత్తమ్‌

  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రె్‌సకు 90 సీట్లు: పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

  • నిజామాబాద్‌లో రైతుమహోత్సవ కార్యక్రమం ప్రారంభం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి మరో రాష్ట్రం రాష్ట్రం లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకే విడతలో రైతు రుణమాఫీ పూర్తి చేసిన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా రూ..33వేల కోట్ల మేర రుణమాఫీ చేశామని చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం మార్చి 31 వరకు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేశామని.. కొందరు రైతుల ఖాతాల్లో జమ చేయలేకపోయామని, త్వరలో వారి ఖాతాల్లోనూ వేస్తామని చెప్పారు. నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో పూడికతీసేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని, దీనిపై.. జపాన్‌ పర్యటన నుంచి సీఎం తిరిగి రాగానే నిర్ణయం తీసుకుంటామాని చెప్పారు. నిజామాబాద్‌ గిరిరాజ్‌ కళాశాలలో మూడు రోజుల పాటు జరగనున్న రైతు మహోత్సవం కార్యక్రమాన్ని సోమవారం మిగతా మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి.. పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమర్‌ గౌడ్‌తో కలిసి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుబంధు ఇచ్చి.. మిగతా అన్ని పథకాలనూ నిలిపివేసిందన్నారు. ఆ ప్రభుత్వ హయాంలో సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందించలేదని.. వాటిని తాము పునరుద్ధరించామని చెప్పారు.

వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారాన్ని అందిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఆనాడు నిర్మించి ఉంటే.. నిజామాబాద్‌ జిల్లా రైతులకు ఎంతో మేలు జరిగి ఉండేదన్నారు. గత ప్రభుత్వం రూ.లక్ష కోట్లు అప్పుతెచ్చి కాళేశ్వరం నిర్మించినా.. ఉపయోగం లేకుండా పోయిందదన్నారు. మిగతా రాష్ట్రాలకన్నా అత్యధిక ధాన్యం ఉత్పత్తి మన రాష్ట్రంలోనే జరిగిందని, గత రెండు సీజన్‌లో 2.85కోట్ల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులు సాధించామని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీల పెండింగ్‌ పనులను త్వరలోనే మొదలు పెడతామన్నారు. దేశంలో మరకెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 80శాతం మందికి సన్నరకం బియ్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల రాష్ట్రంలో 3.1 కోట్ల మందికి సన్న బియ్యాన్ని పంపిణీ చేశామన్నారు. మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ నిజాం నిర్మించిన నిజాంసాగర్‌ ప్రాజెక్టుతో నిజామాబాద్‌ జిల్లా సస్యశ్యామలంగా మారిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక నిజాం నవాబు ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి రైతులను ఇక్కడికి రప్పించారని పేర్కొన్నారు. ఆ రైతులే మనకు పంటలు పండించే విధానాన్ని నేర్పారన్నారని వివరించారు. రైతులు ఓట్లు వేసినందు వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని.. ఇది ప్రజల, రైతుల ప్రభుత్వం అని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 90 సీట్లకు పైగా గెలుస్తుందన్నారు.

హెలికాప్టర్‌ గాలికి కూలిన స్వాగత తోరణం

రైతుమహోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్‌ నుంచి తుమ్మల. జూపల్లి, ఉత్తమ్‌, మహే్‌షకుమార్‌ గౌడ్‌లు హెలికాప్టర్‌లో వచ్చారు. హెలికాప్టర్‌ కలెక్టరేట్‌లోని హెలీప్యాడ్‌లో దిగాల్సి ఉండగా.. పైలెట్‌ పొరపాటు వల్ల గిరిరాజ్‌ కళాశాల మైదానంలో దిగింది. ఆ గాలి వల్ల స్వాగత తోరణం కూలిపోయింది. గాలికి ఎగిసిన ధూళి కారణంగా పోలీసులు, ప్రజలు తలో దిక్కున పరుగులు తీశారు. ఈ ఘటనతో అక్కడ కాస్త గందరగోళం నెలకొంది.

ఈ వార్తలు కూడా చదవండి…

CM Revanth Reddy: ఆ అధికారిని రిటైరయ్యాక కొనసాగించండి

BRS MLC Kavitha: పేరుకే ముగ్గురు మంత్రులు అభివృద్ధి శూన్యం

Cybercrime: సైబర్‌ నేరగాళ్లకు కమీషన్‌పై ఖాతాల అందజేత

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date – Apr 22 , 2025 | 04:34 AM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights