TGPSC Group 3 Results Expected Date : టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

జూనియర్ అసిస్టెంట్, ఎల్‌డి స్టెనో, టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ వంటి 1365 పోస్టుల కోసం TSPSC గ్రూప్ 3 పరీక్ష జరిగింది. TSPSC గ్రూప్ 3 ఫలితాలు 2025 కేటగిరీ వారీగా కటాఫ్ మార్కులతో పాటు విడుదల చేయనున్నారు. ఈ కటాఫ్ మార్కులను క్లియర్ చేసిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం దరఖాస్తు చేయడానికి షార్ట్‌లిస్ట్ చేయబడతారు. ఇక ఫలితాలను చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు ఎప్పటికప్పుడు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫలితాలు విడుదలయ్యాక అభ్యర్థులు వారి ఫలితాలను యాక్సెస్ చేయడానికి రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
TSPSC గ్రూప్ 3 కటాఫ్ మార్కులు 2025 (Expected)
TSPS గ్రూప్ 3 ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష విధానంలో 3 పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు కమిషన్ విడుదల చేసిన కనీస కటాఫ్ మార్కులను స్కోర్ చేయాల్సి ఉంటుంది. పరీక్షలో కనీసం 40 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు తదుపరి రౌండ్ ఎంపికకు అర్హులయ్యే అవకాశం ఉంది. TSPSC గ్రూప్ 3 కోసం Expected కటాఫ్ మార్కులు క్రింద ఇవ్వబడ్డాయి:
- UR/ General – 190 -200
- EWS- 185 -195
- OBC- 175 -180
- SC- 155 -165
- ST- 165 -175
- PWD- 145 -160
TSPSC Group 2 Key : తెలంగాణ గ్రూప్ 2 ఆన్సర్ కీ విడుదల
మరోవైపు తెలంగాణ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదలైంది. తెలంగాణ గ్రూప్-2 ప్రిలిమినరీ ఆన్సర్ కీ 18న (శనివారం) నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈనెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల నుంచి ప్రాథమిక కీ అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాలు తెలుపడానికి డైరెక్ట్ లింక్ ఇదే. రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. TGPSC Group 2 ఎగ్జామ్ 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటి దశ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. త్వరలో TSPSC Group 2 ఫలితాలు సైతం విడుదల చేయనున్నారు.