TSPSC EO Result 2025 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ () ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలపై దృష్టి సారించడమే కాకుండా.. వరుసగా రిజల్ట్ విడుదల చేస్తున్నారు. ఈక్రమంలో..

టీజీపీఎస్సీ మహిళల కోసం ప్రత్యేకంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 181 గ్రేడ్-1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సూపర్‌వైజర్ పోస్టులకి 2022 సెప్టెంబర్ 8 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నారు. ఇక.. ఈ పోస్టులకు ఎంపికైన వారికి వేతన పరిధి రూ.35,720 -రూ.1,04,430 మధ్య ఉంటుంది. ఈ ఉద్యోగాలకి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
జోన్ల వారీగా ఖాళీలు చూస్తే:
కాళేశ్వరం- 26, బాసర- 27, రాజన్న- 29, భద్రాద్రి- 26, యాదాద్రి- 21, చార్మినార్- 21, జోగులాంబ- 31 పోస్టులు జోన్ల వారీగా ఖాళీలు ఉన్నాయి. హోమ్ సైన్స్/సోషల్ వర్క్/సోషియాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్/ బోటనీ/ జువాలజీ అండ్ కెమిస్ట్రీ/ అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్/ బోటనీ/ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్/ బయో కెమిస్ట్రీ/ ఫుడ్ సైన్సెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్/ జువాలజీ/ బోటనీ అండ్ కెమిస్ట్రీ/ బయోలాజికల్ కెమిస్ట్రీ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
జోన్ల వారీగా ఖాళీలు: 181
- కాళేశ్వరం- 26
- బాసర- 27
- రాజన్న- 29
- భద్రాద్రి- 26
- యాదాద్రి- 21
- చార్మినార్- 21
- జోగులాంబ- 31
తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలు విడుదల
TSPSC Hostel Welfare Officer Result 2025 : తెలంగాణ (Telangana) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో Hostel Welfare Officer పరీక్షలకు సంబంధించిన తుది ఫలితాలు మార్చి 17న టీజీపీఎస్సీ కమిషన్ విడుదల చేసింది. రిజల్ట్ వివరాలకు లింక్ ఇదే. తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో పలు పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 అధికారులు (Hostel Welfare Officer), శిశు సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు 2022 డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.