TSHC Hall Ticket 2025 : తెలంగాణలో 1673 కోర్టు ఉద్యోగాలు.. హాల్‌టికెట్లు విడుదల

Written by RAJU

Updated on:

TS High Court Hall Ticket 2025 : తెలంగాణలో కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

టీఎస్‌హెచ్‌సీ హాల్‌టికెట్‌ 2025
టీఎస్‌హెచ్‌సీ హాల్‌టికెట్‌ 2025

 

TSHC Hall Ticket Download 2025 : తెలంగాణలో 1673 కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్ష హాల్‌టికెట్స్‌ తాజాగా విడుదలయ్యాయి. అభ్యర్థులు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఎంటర్‌ చేసి హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినర్‌, జూనియర్‌ అసిస్టెంట్, ఫీల్డ్‌ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్‌, సబ్-ఆర్డినేట్‌ సర్వీస్ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి 20 వరకు షిఫ్ట్‌ల ప్రకారం టీజీహెచ్‌సీ పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన హాల్‌టికెట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://tshc.gov.in/ చూడొచ్చు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.TGHC పరీక్ష తేదీలు :

  • ఎగ్జామినర్‌ పోస్టులకు – 2025 ఏప్రిల్ 15
  • జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు – ఏప్రిల్ 16
  • ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు – ఏప్రిల్ 20
  • రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు – ఏప్రిల్ 20
  • కాపీయిస్ట్‌ పోస్టులకు – ఏప్రిల్ 15
  • టైపిస్ట్‌ పోస్టులకు- ఏప్రిల్ 15

 

 

Subscribe for notification
Verified by MonsterInsights