నిరుటి కన్నా రుణ పరిమితి వెయ్యి పెంపు
పత్తి, పామాయిల్ తోటలకు 48 వేలు
మిర్చి పంటకు 86 వేలు.. టెస్కాబ్ ఖరారు
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): వరి, పత్తి, మొక్కజొన్న తదితర ప్రధాన పంటలతోపాటు చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు సాగుకు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) 2025-26 వార్షిక రుణ పరిమితిని ఖరారుచేసింది. వ్యవసాయ, ఉద్యాన పంటలతోపాటు పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు, పందుల పెంపకానికి కూడా రుణపరిమితిని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రస్థాయి సాకేంతిక కమిటీ(ఎ్‌సఎల్‌టీసీ) ప్రతిపాదనలమేరకు ఖరారుచేసిన రుణపరిమితికి టెస్కాబ్ ఆమోదముద్రవేసి…. ప్రభుత్వానికి, బ్యాంకులకు, అన్ని జిల్లాలకు పంపించింది. టెస్కాబ్ ఖరారుచేసిన రుణపరిమితికి అనుగుణంగా రైతులకు పంట రుణాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్- 2025-26 ప్రకారం రైతులకు రుణపంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచీ బ్యాంకులకు ఆదేశాలు వెళ్లాయి. నిరుటికి ఇప్పటికి రుణపరిమితిలో పెరుగుదల నామమాత్రంగా ఉంది. పంటల పెట్టుబడి వాస్తవ ఖర్చులకు, టెస్కాబ్ ప్రకటించిన రుణపరిమితి కి వ్యత్యాసం ఉంటోంది. అందులో బ్యాంకర్లు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు రుణాలివ్వటంలేదు.ఈ క్రమంలో రుణపరిమితి ఎక్కువ పెరుగుతుందని రైతులు ఆశించినా లాభం లేకపోయింది. నిరుటి కన్నా వరికి ఎకరానికి కేవలం రూ.వెయ్యి పెంచారు. మొక్క జొన్న, పత్తి, వేరుశనగకు రూ.2వేల చొప్పున పెం చారు. సజ్జకు, కంది, మినుముకు రూ.వెయ్యి పెంచారు. పామాయిల్‌కు మాత్రం రూ.4వేలు పెరిగింది. వాస్తవ సాగు ఖర్చులు పరిగణనలోకి తీసుకోకుండా నామమాత్రంగా రుణపరిమితి ఖరారుచేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2025- 26 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పట్టిక
పంట పేరు రుణ పరిమితి(రూ.లలో) పంట పేరు రుణ పరిమితి(రూ.లలో) యూనిట్లు రుణ పరిమితి(రూ.లలో)
వరి 44,000- 46,000 పసుపు 88,000- 90,000 గొర్రెలు(20+1) 26,000- 28,000
వరి (శ్రీ) 36,000- 38,000 జొన్న 19,000- 21,000 మేకలు(20+1) 27,000- 29,000
విత్తన వరి 48,000- 50,000 మినుము 20,000- 22,000 పందులు(3+1) 61,000- 62,000
పత్తి 46,000- 48,000 ఆముదం 20,000- 21,000 గేదె (1) 33,000- 35,000
పత్తి విత్తనోత్పత్తి 1,40,000- 1,50,000 పెసర 20,000- 22,000 ఆవు (1) 33,000- 35,000
మొక్కజొన్న 34,000- 36,000 శనగలు 25,000- 27,000 బ్రాయిలర్ కోడిపిల్ల 200- 210
కంది 23,000- 25,000 పొద్దుతిరుగుడు 28,000- 30,000 లేయర్ కోడిపిల్ల 420- 440
మిర్చి 84,000- 86,000 వేరుశనగ 30,000- 32,000 చేపలు(హెక్టారు) 4,00,000
పామాయిల్ 46,000- 48,000 చెరకు 80,000- 82,000 మత్స్యకారులు 35,000
సోయాబీన్ 28,000- 30,000 నువ్వులు 20,000- 22,000
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు…
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News
Updated Date – May 03 , 2025 | 05:03 AM