హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30) విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసిన విద్యార్ధులు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌తోపాటు అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లలోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఇక తాజా ఫలితాల్లో ఎప్పటి మాదిరి గానే అమ్మాయిలు సత్తా చాటారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ అమ్మాయిలు అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి ఫలితాల్లో 98.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెసిడెన్షియల్ స్కూల్స్ లో 98.7% ఉత్తీర్ణత నమోదైంది. 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. కేవలం 2 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత శాతం నమోదైంది.
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు
ఇవి కూడా చదవండి
కాగా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇక ఏప్రిల్ 15వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికాగా.. మార్కుల ఆల్‌లైన్ ప్రక్రియ కూడా విద్యాశాఖ వేగవంతంగానే పూర్తి చేసింది. ఈ ఏడాది నుంచి పదో తరగతిలో గ్రేడ్ విధానాన్ని తొలగించిన అధికారులు తాజా ఫలితాల్లో విద్యార్ధులందరికీ సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు, ఒక్కో సబ్జె్క్టుకు గ్రేడ్లు కూడా ఇచ్చారు. అంతేకాకుండా మార్కుల మెమోలపై పాస్, ఫెయిల్ అని కూడా మెమోలపై విద్యాశాఖ వెల్లడించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.