హైదరాబాద్, ఏప్రిల్ 30: రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30) మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. మొత్తం 5,07,107 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. 4,96,374 మంది రెగ్యులర్, 10,733 మంది ప్రైవేట్ విద్యార్ధులు రాశారు. అందులో 4,60,519 మంది (92.78 శాతం) పరీక్షల్లో ఉత్తీర్ణత పొందారు. తాజా పదో తరగతి ఫలితాల్లో టాప్‌లో నిలిచిన జిల్లాల్లో.. మొదటి స్థానం లో 99.29 % మహబూబాబాద్ జిల్లా, రెండో స్థానం సంగారెడ్డి జిల్లా 99.09 నిలిచాయి. వికారాబాదు జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ శాతం 73.97%తో ఉత్తీర్ణతలో చివరి స్థానంలో నిలిచింది.
తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు
ప్రవైటు కంటే రెసిడెన్షియల్ స్కూల్స్ లో అధికంగా 98.79 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎయిడెడ్, జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల్లో 92.78 శాతం కంటే తక్కువ ఉత్తర్ణత సాధించాయి. మొత్తం 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇక రాష్ట్రంలో 2 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత నమోదైంది.
ఇవి కూడా చదవండి
పదో తరగతి పరీక్షలకు సంబంధించి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలతోపాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు కూడా విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. పదో తరగతి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఒక్కో సబ్జెక్టుకు రూ.500/- చొప్పున చెల్లించి నేటి నుంచి 15 రోజుల్లోపు అంటే మే 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రీవెరిఫికేషన్‌తోపాటు జవాబు పత్రాల స్కాన్ కాపీలు పొందేందుకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించి ఈ రోజు నుంచి మే 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్.. అన్నింటికి దరఖాస్తు, ఫీజు చెల్లింపులు ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు కొనసాగుతుంది. విద్యార్ధులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.