తెలంగాణ (Telangana) రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ)- స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని (Hyderabad) జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయుహెచ్) నిర్వహిస్తోంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, అనుబంధ ప్రొఫెషనల్ కళాశాలల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ తదితర గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల (Telugu states) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు
-
బీఈ, బీటెక్; బీటెక్(బయోటెక్నాలజీ/ డెయిరీ టెక్నాలజీ/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/ ఫుడ్ టెక్నాలజీ); బీఫార్మసీ; బీఎస్సీ ఆనర్స్(అగ్రికల్చర్/హార్టికల్చర్); బీఎస్సీ ఫారెస్ట్రీ; బీవీఎస్సీ అండ్ ఏహెచ్; బీఎ్‌ఫఎస్సీ
-
ఫార్మా – డీ(డాక్టర్ ఆఫ్ ఫార్మసీ)
-
బీఎస్సీ నర్సింగ్
అర్హత: అభ్యర్థులు చేరదలచుకున్న కోర్సును అనుసరించి మేథమెటిక్స్/బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/ బయాలజీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/ పన్నెండో తరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ నిర్వహించే డిప్లొమా ఎగ్జామ్ ఉత్తీర్ణులు/రాసేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. బైపీసీ అభ్యర్థులు బయోటెక్నాలజీ కోర్సుల్లో చేరాలంటే మేథమెటిక్స్‌లో బ్రిడ్జ్ కోర్సు ఎగ్జామ్ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ అభ్యర్థులకు కనీసం 45 శాతం, రిజర్వ్‌డ్ వర్గాల అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి.
వయసు: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో చేరేవారికి డిసెంబరు 31 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. ఫార్మా -డీ కోర్సులో ప్రవేశానికి 17 ఏళ్లు నిండి ఉండాలి. మిగిలిన కోర్సుల్లో చేరాలంటే 17 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు
-
ఎంపీసీ గ్రూప్ అభ్యర్థులు ‘ఇ’ కోడ్ దరఖాస్తు ఫారాన్ని; బైపీసీ గ్రూప్ అభ్యర్థులు ‘ఏఎం’ కోడ్ దరఖాస్తు ఫారాన్ని సబ్మిట్ చేయాలి.
-
బీఈ/ బీటెక్/బీఫార్మసీ(ఎంపీసీ)/ ఫార్మా-డీ(ఎంపీసీ) కోర్సులకు ఇంజనీరింగ్ (ఇ) కేటగిరీ కింద; బీఎస్సీ/ బీవీఎస్సీ/బీఎ్‌ఫఎస్సీ/ బీఫార్మసీ(బైపీసీ)/ ఫార్మా-డీ(బైపీసీ/బీటెక్ బయోటెక్నాలజీ(బైపీసీ) కోర్సులకు అగ్రికల్చర్ అండ్ మెడికల్ (ఏఎం) కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష వివరాలు: ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.900; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 3 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 10
కరక్షన్ విండో ఓపెన్: ఏప్రిల్ 12 నుంచి 14 వరకు
హాల్‌టికెట్స్ డౌన్‌లోడింగ్: ఏప్రిల్ 30 నుంచి
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్(నాలుగు జోన్‌లు), నల్లగొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు
టీఎస్ ఎంసెట్ 2023 తేదీలు: ఇంజనీరింగ్ (ఇ) స్ట్రీమ్‌కు మే 7, 8, 9; అగ్రికల్చర్ అండ్ మెడికల్ (ఏఎం) స్ట్రీమ్‌కు మే 10, 11
వెబ్‌సైట్: eamcet.tsche.ac.in
Updated Date – 2023-03-03T12:19:59+05:30 IST