- దివి నుంచి భువికి చేరుకున్న వ్యోమగాములు
- స్పందించిన డోనాల్డ్ ట్రంప్
- వ్యోమగాములను ఎందుకు వైట్ హౌస్కు పిలవలేదు?
- ఈ ప్రశ్నకు ట్రంప్ సమాధానం

తొమ్మిది నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు ఈ రోజు తెరపడింది. దివి నుంచి వ్యోమగాములు దివికి చేరుకున్నారు. దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తోపాటూ.. బుచ్ విల్మోర్ మరో ఇద్దరు వ్యోమగాములు.. విజయవంతంగా భూమిపై అడుగు పెట్టారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణమైన వాళ్లు.. భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 3.27 నిమిషాలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో సేఫ్గా ల్యాండ్ అయ్యారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. వ్యోమగాములను ఎందుకు వైట్ హౌస్కు పిలవలేదు? అనే ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు.
READ MORE: IPL 2025: పెద్ద ప్లానే.. 13 వేదికల్లో గ్రాండ్గా ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేయనున్న బీసీసీఐ
వ్యోమగాములు ఇన్ని రోజులు అంతరిక్షంలో గడిపారని.. వారి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ఆహ్వానిస్తామని ట్రంప్ తెలిపారు. “వారు భూమిపై నిలకడగా ఉండటానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అంతరిక్షంలో శారీరక స్థితిలో చాలా మార్పులు ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో శరీరం తేలికగా మారుతుంది. భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ల ఈ పరిస్థితులకు అలవాటు పడాలి. అందుకే వారిని ఇప్పుడే వైట్ హౌస్కు పిలవలేదు. వాళ్లు పరిస్థితి మెరుగుపడి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత తప్పకుండా ఆహ్వానిస్తాం.” అని ట్రంప్ వివరించారు.
READ MORE: Merchant Navy Officer Murder: ‘‘ మా కూతురుని ఉరితీయాలి’’, డ్రగ్స్, వివాహేతర సంబంధం: ముస్కాన్ పేరెంట్స్..