ABN
, Publish Date – Apr 01 , 2025 | 05:19 AM
దండకారణ్యంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్లను వెంటనే నిలిపివేయాలని, దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.

-
సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి
-
పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్
నరసరావుపేట టౌన్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): దండకారణ్యంలో జరుగుతున్న మారణకాండను వెంటనే నిలిపివేయాలని, దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. నరసరావుపేటలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఎన్‌కౌంటర్ల పేరుతో ఆదివాసులను, మావోయిస్టులను హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఆరు నెలల పసిపిల్లల నుంచి యువకులను, మహిళలను కాల్చి చంపడం, 2026 మార్చి 31 నాటికి అందరినీ నిర్మూలిస్తామని బహిరంగ ప్రకటన చేస్తూ సవాల్ విసరటం చట్టబద్దం కాదన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న మిలిటెంట్ సంస్థలతో కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకొని, వారి సమస్యలు పరిష్కారిస్తామని ప్రకటిస్తున్న పాలకులు మావోయిస్టులు, ఆదివాసుల విషయంలో… వారిని నిర్మూలించడమే తమ లక్ష్యం అనటంలోనే దుర్బుద్ధి కనిపిస్తోందన్నారు.
Updated Date – Apr 01 , 2025 | 05:20 AM