ఈ రోజుల్లో చాలా మంది రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే తక్కువ ఛార్జీలు ఉండటంతో సామాన్యుడు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటాడు. అయితే రైలు ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరిలో రైలు ప్రయాణం చేయడం చాలా కష్టం. అందుకే చాలా మంది ఐఆర్‌సీటీసీలో ముందస్తుగా టికెట్స్ బుక్ చేసుకునే ప్రయాణిస్తుంటారు. ఇక కొందరు టికెట్స్ బుక్ అయ్యాక ఇతర కారణాల వల్ల టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటారు. టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటే కొన్ని ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యం. ఏ తరగతికి (ఏసీ, స్లీపర్) ఏ మేరకు ఛార్జీలు వర్తిస్తాయో తెలుసుకుందాం.
కన్ఫార్మ్ టికెట్‌పై ఛార్జీలు:
మీ రైలు ప్రయాణానికి 48 గంటల ముందు టికెట్‌ను రద్దు చేకుకుంటున్నట్లయితే ఏసీ ఫస్ట్ క్లాస్/ఎగ్జిక్యూటివ్ క్లాస్ కేటగిరి అయితే రూ.240 క్యాన్సిలేషన్ ఛార్జీ + జీఎస్టీ వసూలు చేస్తుంది రైల్వే. అదే ఏసీ 2 టైర్/ఫస్ట్ క్లాస్‌లో రూ.200+ జీఎస్టీ, ఏసీ 3 టైర్/ఏసీ ఛైర్ కార్/ ఏసీ 3 ఎకానమీ అయితే రూ.180+ జీఎస్టీ, స్లీపర్ క్లాస్‌లో రూ.120, సెకండ్ క్లాస్‌లో రూ.60 చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి.
48 గంటల నుంచి 12 గంటల మధ్య
అలాగే రైలు ప్రయాణానికి 48 గంటల నుంచి 12 గంటల మధ్య రైలు టికెట్‌ను రద్దు చేసుకుంటున్నట్లయితే మీ టికెట్ ఛార్జీలో 25 శాతం వరకు కట్ చేసుకుని మిగితా అమౌంట్ మీకు అందజేస్తారు. ఇక ఏసీ క్లాసులపై అయితే జీఎస్టీ కూడా వసూలు చేస్తారు. ప్రయాణానికి 12 గంటల ముందు నుంచి 4 గంటల మధ్య టికెట్‌ను క్యాన్సిల్ చేసుకుంటే టికెట్ ధరలో ఏకంగా 50 శాతం వరకు కట్ చేస్తారు. ఈ కోత విధించే మొత్తానికి అన్ని ఏసీ తరగతులకు జీఎస్టీని జోడిస్తారు. అలాగే ప్రయాణానికి 4 గంటల ముందు రద్దు చేస్తే ఒక్క రుపాయి కూడా వాపసు రాదని గుర్తించుకోండి.
ఇవి కూడా చదవండి
వెయిటింగ్ లిస్ట్ టికెట్:
ఇక కన్ఫర్మేషన్ టికెట్‌తో పోలిస్తే వెయిట్‌లిస్ట్ టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు భిన్నంగా ఉంటాయని గుర్తించుకోండి. ప్రయాణానికి 4 గంటల ముందు వెయిటింగ్ లిస్ట్‌లోని టికెట్‌ను క్యాన్సిల్ చేస్తే రూ.20+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఛార్ట్ కన్ఫార్మ్ అయ్యక కూడా వెయిట్‌లిస్ట్‌లో పేర్లు ఉంటే టికెట్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుందని గుర్తించుకోండి. నిబంధనల మేరకు మీ మొత్తాన్ని మీకు రీఫండ్ అందజేస్తారు.
తత్కాల్ టికెట్ నిబంధనలు:
ఇక తత్కాల్‌లో టికెట్ విషయానికొస్తే కన్ఫార్మ్ అయిన తర్వాత రద్దు చేసుకున్నట్లయితే ఎలాంటి వాపసు రాదని గుర్తించుకోండి. ఒకవేళ తత్కాల్ వెయిట్‌లిస్ట్‌లో రద్దు చేసుకుంటే మీ మొత్తం వెనక్కి వస్తాయి. అయితే, క్లరికల్ ఫీజు, కన్వీనియెన్స్ ఫీజు, లావాదేవీ రుసుము వంటివి మినహాయించి మిగిలిన మొత్తం అందిస్తారని గుర్తించుకోండి.
ఇది కూడా చదవండి: Bank Holidays: వినియోగదారులకు అలర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసా..?
ఇది కూడా చదవండి: Sunita Williams: సముద్రంలో సునీత విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్స్.. వీడియో వైరల్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి