Top Medical Colleges 2025: నీట్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేశంలోని టాప్‌ మెడికల్ కాలేజీల ఫుల్ లిస్ట్ ఇదే!

Written by RAJU

Published on:

NIRF ర్యాంకింగ్ 2024 ప్రకారం విద్యా మంత్రిత్వ శాఖ మొత్తం 50 మెడికల్ కాలేజీల జాబితాను విడుదల చేసింది. ఇందులో AIIMS ఢిల్లీ ఫస్ట్‌ ర్యాంక్‌లో ఉంది. ఆ తర్వాత PGIMER చండీగఢ్ 2వ ర్యాంక్‌, CMC వెల్లూరు 3వ ర్యాంక్‌లో ఉన్నాయి. నీట్‌ 2025 పరీక్ష మే 4వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న టాప్‌ వైద్య కళాశాలల NIRF ర్యాంకింగ్‌ను విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు నెట్టింట తెగ వెతికేస్తున్నారు. తాజా NIRF ర్యాంకింగ్‌లో దేశంలోని అగ్రశ్రేణి వైద్య కళాశాలల పూర్తి జాబితాను విడుదల చేసింది.

ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్‌ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు యేటా లక్షలాది మంది విద్యార్ధులు పోటీ పడుతుంటారు. గతేడాది ఏకంగా 24 లక్షల మంది విద్యార్ధులు నీట్ పరీక్ష రాశారు. కానీ సీట్లు మాత్రం వేలల్లో మాత్రమే ఉంటాయి. దీంతో తీవ్ర పోటీ ఉంటుంది. ర్యాంకు వచ్చిన వారంతా టాప్‌ మెడికల్‌ కాలేజీల్లో సీట్లు పొందడానికి ముందు నుంచే సన్నాహాలు చేస్తుంటారు. ఇటువంటి వారి కోసం NIRF ర్యాంకింగ్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

NIRF ర్యాంకింగ్ ప్రకారందేశంలోని అగ్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు ఇవే..

  • న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ
  • చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగఢ్
  • రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రిషికేశ్
  • ఒడిశాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భువనేశ్వర్
  • రాజస్థాన్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జోధ్పూర్
  • మధ్యప్రదేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భోపాల్
  • ఛత్తీస్‌గఢ్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రాయ్‌పూర్‌

NIRF ర్యాంకింగ్ ప్రకారం భారతదేశంలోని అగ్రశ్రేణి ప్రైవేట్ వైద్య కళాశాలలు ఇవే

  • తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, వెల్లూరు
  • తమిళనాడులోని అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్
  • కర్ణాటకలోని కస్తూర్భా మెడికల్ కాలేజీ, మణిపాల్
  • మహారాష్ట్రలోని డాక్టర్ డి.వై. పాటిల్ విద్యాపీఠ్, పూణె
  • తమిళనాడులోని సవీత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, చెన్నై
  • తమిళనాడులోని SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చెన్నై

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification