- తిరుమలకు చంద్రబాబు నాయుడు.. భక్తులకు అన్నప్రసాదం వడ్డించనున్న సీఎం!
- బెట్టింగ్ యాప్స్ పై కొనసాగుతున్న పంజాగుట్ట పోలీసుల విచారణ..
- 15వ రోజు అసెంబ్లీ సమావేశాలు.. ఎస్సీ వర్గీకరణపై నేడు తీర్మానం!
- PVNR ఎక్స్‌ప్రెస్ వే పై కారు దగ్ధం

అర్జున్ S/o వైజయంతి థియేట్రికల్ బిజినెస్ అదిరింది
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఏడాది కాలంగా షూటింగ్ దశలోనే ఉన్నఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. ‘‘కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గా తెరకెక్కుతుంది. ఇటీవల రిలీజ్ చేసిన అర్జున్ S/o వైజయంతి ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమా బిజినెస్ కు ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. కేవలం ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ కు గాను రూ. 12 కోట్లు వరకు రేట్ పలుకుతోంది. అటు రాయలసీమ ఏరియా అయిన సీడెడ్ వరకు రూ. 3.70 కోట్లు చెబుతున్నారు మేకర్స్.
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ హాట్ భామ.. ఈసారి 13 వేదికల్లో.. !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆరంభానికి మరో రెండు రోజులు మాత్రమే ఉంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ ఆరంభోత్సవాన్ని బీసీసీఐ ఘనంగా నిర్వహించనుంది. ఐపీఎల్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ హాట్ భామ దిశ పఠాని డాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది.
ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవంలో ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ తన పాటలతో అభిమానులను అలరించనున్నారు. అయితే ఈసారి ఐపీఎల్‌కు ఆతిథ్యమిస్తున్న 13 వేదికల్లోనూ ఆరంభ కార్యక్రమాలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రతి వేదికలో తొలి మ్యాచ్ సందర్భంగా.. బాలీవుడ్ తారలతో ప్రదర్శనలు నిర్వహించాలని భావిస్తోంది. సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, తృప్తి డిమ్రి, కత్రినా కైఫ్, అనన్య పాండే, మాధురి దీక్షిత్ వంటి బాలీవుడ్ తారలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. మొత్తానికి ఈ సీజన్లో బాలీవుడ్ భామలు సందడి చేయనున్నారు.
PVNR ఎక్స్‌ప్రెస్ వే పై కారు దగ్ధం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ PVNR ఎక్స్‌ప్రెస్ వే పై ఒక కారు లో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. అత్తాపూర్ 151 పిల్లర్ నెంబర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. టాటా క్వాలీస్ కారు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కిందకు దిగిపోయాడు. దీంతో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగాడు. క్షణాల వ్యవధిలోనే కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక వివరాల ప్రకారం, కారు ఇంజన్ ఓవర్ హీట్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం కొంత ఊరట కలిగించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
శంభు సరిహద్దులో రైతుల దీక్ష భగ్నం.. అన్నదాతల అరెస్ట్
హర్యానా-పంజాబ్ శంభు సరిహద్దులో ఉద్రిక్త చోటుచేసుకుంది. వివిధ డిమాండ్లతో అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. అయితే బుధవారం రాత్రి హర్యానా పోలీసులు.. రైతుల ఆందోళనను భగ్నం చేశారు. అన్నదాతలను అరెస్ట్ చేశారు. అనంతరం కాంక్రీట్ బారికేడ్లను బుల్డోజర్లతో తొలగించారు. ఏడాది నుంచి శంభు-ఖనౌరి సరిహద్దు మూసివేసి ఆందోళన చేస్తున్నారు. అయితే బుధవారం కేంద్ర ప్రతినిధి బృందంతో సమావేశం ముగించుకుని తిరిగి వస్తున్న రైతు నాయకులు సర్వాన్ సింగ్ పాంధేర్, జగ్జిత్ సింగ్ దల్లెవాల్ సహా కీలక నేతలను మొహాలిలో అరెస్ట్ చేశారు. అనంతరం నిరసన తెలుపుతున్న ప్రాంతం నుంచి రైతులను ఖాళీ చేయించారు.
‘ఈ నగరానికి ఏమైంది 2’ గురించి హింట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్
మన టాలీవుడ్ యూత్‌కి బాగా నచ్చిన కొన్ని క్లాసిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒక్కటి. విశ్వక్ సేన్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ సింపుల్ స్టోరీతో యూత్‌ని ఎంతగానో అట్రాక్ట్ చేసింది. ఫుల్ ఎంటర్టైనింగ్‌గా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన ప్రారంభంలో ఆడియెన్స్‌కి పెద్దగా కనెక్ట్ కానప్పటికీ, మీమ్స్ వల్ల ఈ సినిమా నెట్టింట ఎంతో పాపులర్ అయ్యింది.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ రూపొందించేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రోహిత్ శర్మ ఫుల్ చిల్.. ఒక్క రాత్రికి రూ.23 లక్షలు!
ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను భారత్ గెలిచిన విషయం తెలిసిందే. టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐపీఎల్ 2025కు ముందు ఫుల్ చిల్ అయ్యాడు. ఐపీఎల్‌తో దాదాపుగా రెండు నెలలు బిజీ కానున్న నేపథ్యంలో హిట్‌మ్యాన్ తన ఫామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. సతీమణి రితిక, కూతురు సమైరాతో కలిసి ప్రశాంత వాతవరణంలో ఎంతో సరదాగా గడిపాడు. తాజాగా మాల్దీవుల నుంచి వచ్చిన రోహిత్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మాల్దీవుల్లోని వాల్డోర్ఫ్ ఆస్టోరియా మాల్దీవులు ఇథాఫుషి (Waldorf Astoria Maldives Ithaafushi) అనే లగ్జరీ రిసార్ట్‌లో రోహిత్ శర్మ తన ఫామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు. మాల్దీవల్లో ఇది అతిపెద్ద ఐలాండ్‌లలో ఇది ఒకటి. ఇక్కడ ఎంతో విశాలవంతంగా, ప్రశాంత వాతవరణంలో రీఫ్ విల్లా, ఓవర్ వాటర్ విల్లా, బీచ్ విల్లాలు ఉంటాయి. రీఫ్ విల్లాలో హిట్‌మ్యాన్ సేదతీరడాని కొన్ని ఇంగ్లీష్ మీడియాలు కథనాలు రాశాయి. ఇందులో అన్ని రకాల విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయట. రోహిత్ బైక్, సైకిల్ రైడింగ్ చేస్తూ చిల్ అయ్యాడఐ పేర్కొన్నాయి. ఇక్కడ త్రీ బెడ్ రూమ్ విల్లా ఖరీదు ఒక్క రాత్రికి రూ.23 లక్షలు అట. ఈ ధర చూసి అందరూ షాక్ అవుతున్నారు.
దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మల్టీస్టారర్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. ఒకప్పుడు రాజు గారి సినిమా అంటే అటు ప్రేక్షకుల్లోను ఇటు బిజినెస్ సర్కిల్స్ లోను మినిమమ్ గ్యారెంటీ ఉండేది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రీయేటివ్స్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు దిల్ రాజు. కానీ అదంతా గతం. ఇటీవల కాలంలో దిల్ రాజూ నిర్మాణంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అటు బయ్యర్స్ కు కూడా భారీ నష్టాలు మిగిల్చాయి. ఈ ఈఏడాది ఆరంభంలో సంక్రాంతికి వస్తున్నాం తో పాటు గేమ్ ఛేంజర్ తో వచ్చాడు దిల్ రాజు. గేమ్ ఛేంజర్ ప్లాప్ కాగా సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
15వ రోజు అసెంబ్లీ సమావేశాలు.. ఎస్సీ వర్గీకరణపై నేడు తీర్మానం!
15వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. క్వశ్చన్ అవర్‌తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆయకట్టు స్థిరీకరణ, తోటపల్లి ప్రాజెక్ట్ ఆధునికీకరణ, పోలీస్ కానిస్టేబుళ్ల భర్తీపై సభ్యులు ప్రశ్నించనున్నారు. ఎస్ఐలకు డిఎస్పీలుగా ప్రమోషన్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలపై ప్రశ్నలు అడగనున్నారు. ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ రిపోర్ట్.. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సభ ముందు ఉంచనున్నారు. ఎస్సీ వర్గీకరణపై ఇవాళ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయనుంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.
బెట్టింగ్ యాప్స్ పై కొనసాగుతున్న పంజాగుట్ట పోలీసుల విచారణ..
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఈ విచారణ జరిగింది. టేస్టీ తేజ స్టేట్మెంట్ రికార్డు చేసారు పోలీసులు. దాదాపు 11 మంది బుల్లితెర నటులు యాంకర్స్ పై ఇప్పటికే కేసులు నమోదు చేసి నోటీసులు అందించారు పోలీసులు.యాంకర్ విష్ణుప్రియ మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఆమెకు అందించిన నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. కాగా మంగళవారం విచారణకు విష్ణుప్రియ హాజరుకాలేదు. అలాగే ఈ రోజు మరి కొంత మంది ఇన్‌ఫ్లుయన్సర్లు, ప్రమోటర్ లకు నోటీసులు జారీ చేయనున్నారు పోలీసులు. నటి మంచు లక్ష్మి, హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం గతంలో ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిలిస్ట్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కేసులు నమోదైన నటీనటులు తమ సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని ఎవరికి అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. మరికొందరు తాము తెలియక ప్రమోట్ చేశామంటూ తమ సోషల్ మీడియా అకౌంట్‌లలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కేసు వివరాలను పంజాగుట్ట పోలీసుల నుండి ఈడి తీసుకుంది. ఈడి ఎంటర్ కావడంతో కేసులు నమోదైన వారిలో ఆందోళన నెలకొంది. ఏ రోజు తమకు నోటీసులు వస్తాయో ఎప్పుడు తమని అరెస్ట్ చేస్తారేమోనని బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ లో భయం నెలకొంది.
తిరుమలకు చంద్రబాబు నాయుడు.. భక్తులకు అన్నప్రసాదం వడ్డించనున్న సీఎం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కుటుంబంతో కలిసి నేడు, రేపు తిరుమల పర్యటనకు వెళుతున్నారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌తో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం దర్శించుకోనున్నారు. చంద్రబాబు కుటుంబం ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
గురువారం రాత్రి 10:30 గంటలకు సీఎం చంద్రబాబు తిరుమల చేరుకోనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు కుటుంబసభ్యులతో కలసి సీఎం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దగ్గరుండి చూసుకుంటారు. దర్శనానంతరం కుటుంబసభ్యులతో కలసి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకు చేరుకుంటారు. అక్కడ భక్తులకు అన్నప్రసాదంని సీఎం స్వయంగా వడ్డించనున్నారు. నారా దేవాన్ష్ పుట్టినరోజు నాడు (మార్చి 21) అన్నప్రసాద కేంద్రంలో అయ్యే ఖర్చు రూ.44 లక్షలను సీఎం భరించనున్నారు. రూ. 44 లక్షలను టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళంగా అందించనున్నారు.