
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు నోరు కూడా శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే దంతాలు మనం ఆహారాన్ని నమిలి తినడానికి సహాయపడితే నాలుక ఆహారం రుచిని గ్రహించడానికి సహాయపడుతుంది. నాలుక లేకుండా ఏదైనా రుచి చూడటం అసాధ్యం. అయితే నాలుక పని మనం తినే ఆహారాన్ని రుచి చూడటం మాత్రమే కాదు.. మన ఆరోగ్య సమస్యల గురించి చెప్పే శక్తి కూడా నాలుకకు ఉంది. అందుకనే డాక్టర్ దగ్గరకు వెళ్ళితే మొదట నాలుకను పరీక్షిస్తారు. ఎందుకంటే నాలుక రంగు మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారో చెబుతుంది. సాధారణంగా మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. నాలుక ఆరోగ్యంగా ఉండాలి. కనుక నాలుక శుభ్రంగా లేకపోతే ఏమి జరుగుతుందో తెలుసా..
సాధారణంగా ఎక్కువగా బ్యాక్టీరియా నోరు, నాలుక మీద కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఎప్పుడూ తేమతో ఉంటాయి. అందువల్ల అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను నివారించడానికి మన నోరు, నాలుకను శుభ్రంగా ఉంచుకోవడం అవసరం. దంతక్షయం, చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా నాలుకపై కనిపిస్తుంది. నాలుక శుభ్రం చేసుకున్నప్పుడు బ్యాక్టీరియా పోతుంది. అందువల్ల దంతక్షయం, చిగుళ్ల వ్యాధిని తగ్గించడానికి.. వాటి వల్ల వచ్చే దుర్వాసనను నివారించడానికి, ఆరోగ్యకరమైన నాలుకను కలిగి ఉండటం ముఖ్యం. అదనంగా నాలుకపై విష పదార్థాలు పేరుకుపోతాయి. కనుక ప్రతిరోజూ నాలుకను శుభ్రం చేయడం వల్ల శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది. నాలుక ఇచ్చే సందేశాలు ఏమిటి? నాలిక మీద ఏ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలో తెలుసుకోండి.
నాలుక శుభ్రంగా లేకపోతే కడుపు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. నాలుక నల్లగా ఉండి.. దానిపై తెల్లటి గడ్డలు ఉంటే.. మీ జీర్ణవ్యవస్థ సమస్యలో ఉందని సంకేతం.
నాలుక చాలా మృదువుగా ఉంటే.. అది ఇనుము లోపాన్ని సూచిస్తుంది. మీరు రక్తహీనతతో ఉన్నారని సూచిస్తుంది. కొన్నిసార్లు ఈ లక్షణాలు విటమిన్ లోపం వల్ల కూడా ఏర్పడతాయి. ఇటువంటి సందర్భాల్లో తగినంత పోషకాలు, విటమిన్లు తీసుకోవడం అవసరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)