స్పెయిన్ ఐకానిక్ లా టొమాటినా స్ఫూర్తితో హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ టోమా టెర్రా అనే టమాటా పండుగను నిర్వహిస్తోంది. మే 11న నగరంలోని ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌లో ఈ టమాటా ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్టివల్‌లో వేల కిలోల టమాటాలను ఒకరిపై ఒకరు విసురుతూ ఆనందిస్తారు. అలాగే లైవ్ డీజే సంగీతం, నృత్య ప్రదర్శనలు, ఫుడ్ స్టాళ్లు, షాపింగ్ కోసం ఫ్లీ మార్కెట్, ఫన్ జోన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వాడేసిన టమాటాలను రీసైకిల్ చేసి రైతులకు ఎరువగా అందిస్తారు.
ఇకపోతే, ఈ టమాటా పోరులో పాల్గొనాలనుకున్న వారికి టికెట్ల ధరలు రూ. 499 నుండి రూ. 3,499 వరకు ఉండనున్నాయని నిర్వహకులు తెలియ జేశారు. కాగా ఎండలతో అల్లాడుతున్న హైదరాబాదీలకు ఇప్పుడు టమాటా ఫెస్టివల్ ఒక సరికొత్త సరదా అనుభవాన్ని అందించనుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..