ఉప్పల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉందంటే క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా స్టేడియాలకు పోటెత్తుతారు.
ఈ సీజన్ లోనూ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సన్ రైజర్స్ మ్యాచ్ లకు హాజరవుతున్నారు. ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తున్నారు.
పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ కూడా ఎస్ ఆర్ హెచ్ కు వీరాభిమాని. తరచూ ఆ జట్టుకు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది.
బుధవారం ముంబై – హైదరాబాద్ మ్యాచ్ కోసం ఉప్పల్ వెళ్లింది. SRHకి సపోర్టుగా హడావిడి చేసింది. చివరకు హైదరాబాద్ ఓడిపోవడంతో నిరాశకు లోనైంది.
కానీ అంతలోనే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. అనంతరం పాండ్యా స్మైల్ బాగుందని ఆ ఫొటోలను షేర్ చేసింది.
మరీ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు బజ్జీల పాప కుషిత కల్లపు. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది.