Toll Tax: టోల్‌ ప్లాజాలో పొరపాటున మీ వాహనానికి రెండు సార్లు టోల్‌ ఛార్జ్‌ కట్‌ అయ్యిందా? ఇలా రీఫండ్‌ పొందండి! – Telugu Information | Authorities issued refund in 12.55 lakh circumstances of improper tax assortment at toll in 2024

Written by RAJU

Published on:

టోల్ ప్లాజాల గుండా వెళ్ళే లక్షలాది వాహనాల నుండి పన్ను వసూలు అవుతున్నాయి. దీనిని రోడ్ల నిర్వహణ, మరమ్మత్తు, ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారు. అయితే చాలా సార్లు ప్రజల టోల్ పన్ను పొరపాటున కట్‌ అవుతుంటుంది. 2024 సంవత్సరంలో టోల్ గేట్ల వద్ద తప్పుగా పన్ను వసూలు చేసిన 12.55 లక్షల కేసులలో వాపసు జారీ చేసింది.

ఈ రోజుల్లో ఫాస్టాగ్ ఉపయోగించి టోల్ ఛార్జీలు స్వయంచాలకంగా కట్‌ అవుతుంటుంది. కానీ దీనికి కొన్ని లోపాలు ఉన్నాయి. కొన్నిసార్లు టోల్ రెండుసార్లు అకౌంట్‌ నుంచి కట్‌ అవుతుంటుంది. కొన్నిసార్లు వాహనం టోల్ గుండా కూడా వెళ్ళదు. కానీ డబ్బులు మాత్రం కట్‌ అవుతుంటాయి. కొన్నిసార్లు వాహనానికి నిర్ధేశించి దానికంటే ఎక్కువ టోల్‌ వసూలు అవుతుంటుంది. కొన్నిసార్లు సాంకేతిక లోపం కారణంగా వాహనంపై అదనపు ఛార్జీలు విధించబడతాయి. కొన్నిసార్లు, టోల్ ఆపరేటర్లు తప్పుగా నమోదు చేయడం వల్ల డబ్బు తీసివేయబడుతుంది.

తప్పుడు టోల్ వసూలు విషయంలో ప్రభుత్వం కీలక అడుగు:

తప్పుడు టోల్ వసూలుకు టోల్ ఏజెన్సీలు బాధ్యత వహిస్తే, టోల్ కలెక్టర్‌కు తప్పుగా వసూలు చేసిన టోల్ మొత్తానికి 1,500 రెట్లు జరిమానా విధించవచ్చని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభలో అన్నారు. “నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) ప్రోగ్రామ్ సెంట్రల్ క్లియరింగ్ హౌస్ (CCH) సేవలను అందించే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), 2024 సంవత్సరంలో 410 కోట్ల ఫాస్టాగ్ లావాదేవీలలో 12.55 లక్షల తప్పుడు పన్ను వసూలు కేసులను నివేదించింది. తప్పుడు టోల్ వసూలు కేసుల్లో సంబంధిత ఏజెన్సీలపై ఇప్పటివరకు రూ. 2 కోట్లకు పైగా జరిమానా విధించినట్లు కేంద్ర మంత్రి అన్నారు. 2024లో అటువంటి 5 లక్షలకు పైగా కేసులలో రీఫండ్‌ చేసినట్లు తెలిపారు.

రీఫండ్ కోసం ఇక్కడ ఫిర్యాదు చేయండి:

మీ FASTag ఖాతా నుండి పొరపాటున డబ్బు తీసివేసినట్లయితే మీరు వాపసు కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీరు టోల్ ఫ్రీ నంబర్ 1033 కు కాల్ చేయవచ్చు లేదా falsededuction@ihmcl.com కు ఇమెయిల్ పంపి అదనంగా తీసివేసిన మీ టోల్‌ మొత్తాన్ని వాపసు పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Petrol, Diesel Tax: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌పై అత్యధిక పన్ను విధిస్తున్న రాష్ట్రం తెలంగాణ.. ఏ రాష్ట్రాల్లో ఎంత?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Subscribe for notification