Today Gold and Silver Price March 15 2025

Written by RAJU

Published on:

  • తగ్గిన బంగారం ధరలు
  • నేడు తులం బంగారంపై రూ.110 తగ్గింది
  • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,670
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,200
Today Gold and Silver Price March 15 2025

తులం బంగారం ధర రూ. 90 వేలను తాకడంతో పసిడి కొనుగోలుదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆకాశమే హద్దుగా గోల్డ్ ధరలు పైకి ఎగబాకుతున్నాయి. బంగారం బాటలోనే సిల్వర్ కూడా పయనిస్తోంది. ఇక నిన్నటి వరకు పరుగులు పెట్టిన పుత్తడి ధరలు నేడు పడిపోయాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తగ్గిన గోల్డ్ ధరలతో గోల్డ్ లవర్స్ ఊరట చెందుతున్నారు. నేడు తులం బంగారంపై రూ.110 తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Also Read:Trump: వలసలపై కఠిన చర్యలు.. 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్..

హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,967, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,220 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గడంతో రూ. 82,200 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గడంతో రూ. 89,670 వద్దకు చేరింది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,350గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 89,820 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:IPL 2025 Captains: ఈసారి ఐపిఎల్ లో కొత్త కెప్టెన్స్ వీళ్లే..

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించగా సిల్వర్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. రూ. 1,12,000 వద్ద అమ్ముడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,03,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Subscribe for notification