ABN
, Publish Date – Mar 24 , 2025 | 03:04 AM
తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి భారీగా సిఫారసు లేఖలు వచ్చాయి. తొలిరోజే 90 లేఖలను భక్తులు తీసుకొచ్చి అదనపు ఈవో కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. గతంలో అనుమతించిన తరహాలో తమ లేఖలపై కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించాలంటూ కొద్దినెలల నుంచి టీ-ప్రజాప్రతినిధుల నుంచి టీటీడీపై తీవ్రస్థాయిలో ఒత్తిడి వచ్చింది. ఇదే విషయమై సీఎం చంద్రబాబుకు ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి లేఖ కూడా రాశారు.

తొలిరోజే ఏఈవో కార్యాలయంలో 90 లేఖలు నమోదు
తిరుమల, మార్చి 23(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి భారీగా సిఫారసు లేఖలు వచ్చాయి. తొలిరోజే 90 లేఖలను భక్తులు తీసుకొచ్చి అదనపు ఈవో కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. గతంలో అనుమతించిన తరహాలో తమ లేఖలపై కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించాలంటూ కొద్దినెలల నుంచి టీ-ప్రజాప్రతినిధుల నుంచి టీటీడీపై తీవ్రస్థాయిలో ఒత్తిడి వచ్చింది. ఇదే విషయమై సీఎం చంద్రబాబుకు ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి లేఖ కూడా రాశారు. దానిపై ఆయన సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించారు. దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై ఈ నెల 24 నుంచి దర్శనాలు కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో ఒక లేఖపై ఆరుగురికి మించకుండా వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధ, గురువారాల్లో రూ.300 దర్శన టికెట్లు జారీ చేయనున్నట్టు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
Delhi High Court Judge: నోట్ల కట్టల ఆరోపణలు నిరాధారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ
Karnataka: ఘోర ప్రమాదం.. భారీ రథాలు కూలిపోయి.. బాబోయ్..
Navy Employee Case: నాకు ఫుడ్ వద్దు.. డ్రగ్స్ కావాలి.. నిందితురాలి కొత్త డిమాండ్
Read Latest and National News
Updated Date – Mar 24 , 2025 | 03:04 AM