తిరుపతి: తిరుమల (Tirumala) అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ పాపవినాశనం (Papavinasanam) జలాశయం భక్తులకు పుణ్యస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్నానం చేసి.. ఆ నీటిని తలపై చల్లుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాంటి పవిత్ర స్థలంలో ఏపీ ప్రభుత్వం (AP Govt.) అటవీశాఖ (Forest Department) ఆధ్వర్యంలో మంగళవారం బోటింగ్ ట్రయల్ రన్ (Boating Trial Run) చేపట్టింది. అయితే పవిత్ర పాపవినాశనం డ్యాంలో బూటింగ్‌ను ప్రవేశపెట్టాలన్న నిర్ణయం పట్ల భక్తులు (Devotees) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలను విహారయాత్రగా మార్చవద్దని భక్తులు కోరుతున్నారు.
Also Read..: అవినాశ్ డైరెక్షన్ కృష్ణారెడ్డి యాక్షన్
తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాల్లో పాపవినాశనం డ్యాం ఒకటి. ఈ నీరు పవిత్రమైనదిగా భక్తులు నమ్ముతారు. ఇక్కడకు వచ్చే భక్తులు ఈ నీటిలో స్నానం చేసి ఆధ్యాత్మిక శుద్ధిని పొందుతారు. అలాంటి ఈ డ్యాంలో బోటింగ్ సౌకర్యం ప్రవేశపెడితే ఇది ఒక తీర్థయాత్ర స్థలం కంటే విహార కేంద్రంగా మారే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీస్తుందని, భక్తుల మనోభావాలను గాయపరుస్తుందని అంటున్నారు.
బోటింగ్ ట్రయల్ రన్‌పై భక్తుల నుంచి అభ్యంతరాలు రావడంతో అధికారులు స్పందించారు.. బోటింగ్ అంశంలో స్పష్టత ఇచ్చారు. సెక్యూరిటీ ఆడిట్లో భాగంగా ప్రయోగాత్మకంగా బోటింగ్ టీమ్ అక్కడ పర్యవేక్షించిందని డీఎఫ్‌వో వివేక్ ఆనంద్ వివరణ ఇచ్చారు. ఇక్కడి నుంచి బాలపల్లె, చిట్వేల్ అటవీ ప్రాంతం వరకు బయోస్పియర్ సరిహద్దులున్నందున రక్షణకు ఈ ప్రదేశం కీలకమవుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బయోస్పియర్ రిజర్వు పరిధిలో ఎకోటూరిజం అభివృద్ధికున్న అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. తిరుమల వంటి పుణ్యక్షేత్రం పరిధిలో ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేముందు అందరి అభిప్రాయాలు తీసుకుంటామని, సమ్మతి లభిస్తేనే ముందుకెళతామని చెప్పారు.
కాగా తిరుమలకు ఏటా కోట్లాది మంది భక్తులు వస్తారు. కాబట్టి బోటింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడతాయని ప్రభుత్వం భావించవచ్చు. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. ఏపీ అటవీశాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉన్నారు. అయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. అలాంటి ఆయన ఆధ్వర్యంలోనే తిరుమలలో బోటింగ్ ప్రవేశపెట్టాలని ఆలోచిస్తుండడం ఆశ్చర్యంగా ఉందని.. ఈ విషయంలో పవన్ చొరవ తీసుకుని బోటింగ్ ప్రవేశపెట్టకుండా చూడాలని సనాతన ధర్మ పరిరక్షకులు కోరుతున్నారు. పాపవినాశనం జలాల పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉగాదికి కొత్త మంత్రులు
టైమంటే టైమే!
For More AP News and Telugu News
Updated Date – Mar 26 , 2025 | 07:26 AM