తిరుమల: అలిపిరి చెకింగ్ పాయింట్ (Alipiri Checkpoint) వద్ద అలజడి రేగింది. ఓ వ్యక్తి హల్ చల్ (Hull Chal) చేశాడు. చెకింగ్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాని (Motorcycle) ఆపకుండా తిరుపతి (Tirupati) సింగాలగుంటకీ చెందిన అమీర్ అంజద్ ఖాన్ (Amir Anjad Khan) అనే వ్యక్తి దూకుపోయాడు. అతనిని నిలువరించేందుకు యత్నించిన సమయంలో ద్విచక్ర వాహనంతో భద్రతా సిబ్బందిపైకి దూసుకెళ్లాడు. అడ్డుకున్న భద్రతా సిబ్బందికీ గాయ్యాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. తిరుమలలో జీఎన్‌సీ టోల్ గేట్ (GNC Toll Gate) దగ్గర అంజద్ ఖాన్‌ను విజిలేన్స్ సిబ్బంది (Vigilance staff) అదుపులోకి తీసుకున్నారు. నెత్తిన ముస్లిం టోపీ ధరించి.. భద్రతా వళ్లయాన్ని తప్పించుకొని.. తిరుమలకు ఎందుకు వచ్చావని అంజద్‌ని విజిలేన్స్ సిబ్బంది. విచారిస్తోంది.
Also Read..: వరంగల్ ఈద్గాలు మసీదులో రంజాన్ సందడి..
శ్రీవారి దర్శనార్ధం వచ్చిన వారిని అలిపిరి భద్రత వలయం వద్ద సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కొండపైకి అనుమతి ఇస్తారు. అయితే సోమవారం ఉదయం ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చాడు. చెకింగ్ పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తి వాహనాన్ని ఆపకుండా భద్రతా సిబ్బందిని తప్పించుకుని తిరుమలకు వచ్చాడు. వినాయకుని గుడి వద్ద కూడా భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తారు. అక్కడ కూడా అతనిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆపకూడా వేగంగా దూసుకుపోయాడు. దీంతో జీఎన్‌సీ టోల్ గేట్ దగ్గర అప్రమత్తమైన సిబ్బంది అతనిని పట్టుకున్నారు. భద్రతా తనతిఖీల్లో ఎందుకు వాహనాన్ని ఆప్పలేదని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి మద్యం సేవించినట్లు గుర్తించారు. వైద్య పరీక్షల నిమిత్తం అతనిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. తర్వాత టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసే అవకాశముంది. ఈ ఘటన తర్వాత భద్రాతా సిబ్బంది అప్పమత్తమయ్యారు. తిరుమలకు వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తున్నారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులువేచి ఉన్నారు. కాగా ఆదివారం శ్రీవారిని 62,263 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,733 మంది భక్తులు తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారిహుండీ ఆదాయం రూ.3.65 కోట్లుగా వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బెట్టింగ్ యాప్స్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News
Updated Date – Mar 31 , 2025 | 11:10 AM