- షిండే, అజిత్ పవార్‌లకు కాంగ్రెస్ ఆఫర్..
- ఫడ్నవీస్‌ని పడగొట్టి, తమతో చేతులు కలపాలి..
- మీరే సీఎంలు అంటూ నానా పటోలే కామెంట్స్..

Congress: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ పీసీసీ చీఫ్ నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతుంటే, శివసేన నేత ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆఫర్ ఇచ్చారు. ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసి ప్రతిపక్షంతో చేరితే షిండే, పవార్‌లు ఇద్దరికీ ముఖ్యమంత్రి పదవులు ఇస్తామని పటోలే శుక్రవారం అన్నారు.
Read Also: Gutta Jwala : తెలుగు సినిమాలకి తెల్లగా ఉంటే చాలు : గుత్తాజ్వాల హాట్ కామెంట్స్
“దేవేంద్ర ఫడ్నవీస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, మేము మీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. షిండే, పవార్‌లు వస్తే వారిని కలుపుకుంటామని చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఠాక్రే శివసేనలకు కలిపి 50 సీట్లు ఉన్నాయి. శివసేన షిండేకి 57 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీకి 41 సీట్లు ఉన్నాయి. ఈ పార్టీలు అన్ని కలిస్తే 148 సీట్లు వస్తాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. ఈ లెక్కల ఆధారంగా నానా పటోలే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. షిండే, పవర్‌లకు నానా పటోలే ఆఫర్ మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంలో పెరుగుతున్న విభేదాలను బహిర్గతం చేసింది. ఇదిలా ఉంటే, మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే మాట్లాడుతూ.. అధికార పక్షంలో అంతర్గత విభేదాలను ఖండించారు.