- గుజరాత్ నుంచి వలస వెళ్లి అమెరికాలో ప్రాణాలు పోగొట్టుకున్నారు..
- యూఎస్ స్టోర్ కాల్పుల్లో తండ్రి, కుమార్తె మృతి..

US Store Shooting: అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ వ్యక్తి, అతడి కుమార్తె మరణించారు. వర్జీనియాలోని ఒక డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో 24 ఏళ్ల ఉర్మి, ఆమె తండ్రి ప్రదీప్ పటేల్‌ని జార్జ్ ఫ్రేజియర్ డెవాన్ వార్టర్(44) అనే వ్యక్తి కాల్చి చంపాడు. కాల్పుల ఘటనలో ప్రదీప్ పటేల్ అక్కడికక్కడే మరణించగా, ఉర్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడు వార్టర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Meerut Murder: భర్త దారుణహత్య.. జైలులో డ్రగ్స్ డిమాండ్ చేస్తున్న భార్య, లవర్..
నివేదిక ప్రకారం.. తెల్లవారుజామున మద్యం కొనుగోలు చేయడానికి వచ్చిన నిందితుడు, రాత్రి సమయంలో షాప్ ఎందుకు మూసేశారని అడిగాడు, ఆ తర్వాత ఇద్దరిపై కాల్పులు జరిపాడు. ప్రదీప్ పటేల్, అతని భార్య హంసబెన్, వారి కుమార్తె ఉర్మి గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాకు చెందినవారు. ఆరు సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లారు. వారు బంధువు పరేష్ పటేల్ యాజమాన్యంలోని కన్వీనియన్స్ స్టోర్‌లో పనిచేస్తున్నారు.
మద్యం కోసం రాత్రి అంతా వేచి ఉన్న నిందితుడు, కోపంతో ఈ దారుణానికి తెగబడినట్లు తెలుస్తోంది. నిందితుడు వార్టన్ రాత్రంతా తమ డిపార్ట్మెంట్ స్టోర్ చుట్టూ దాక్కున్నట్లు గుర్తించారు. ప్రదీర్, ఉర్మి వచ్చినప్పుడు, షాప్ ఎందుకు మూసివేసి ఉందని ప్రశ్నించారు, తాను రాత్రంతా వేచి ఉన్నట్లు చెప్పాడు. కోపంతో, నిరాశతో వార్టన్ ఇద్దరిపై కాల్పులు జరిపాడు. ప్రదీప్ శరీరంలో రెండు బుల్లెట్లు దూసుకెళ్లగా, ఒక బుల్లెట్ ఉర్మికి తాకింది.
నిందితుడు వార్టన్‌పై ఫస్ట్ డిగ్రీ మర్డర్, ఆయుధాల చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఈ సంఘటనపై మెహ్సానాలోని పటేల్ బంధువులు దిగ్భ్రాంతిని వ్యక్తి చేశారు. ఈ జంట హత్య అమెరికాలో ఆయుధాల క్రైమ్‌ని మరోసారి హైలెట్ చేసింది. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు నార్త్ కరోలినాలో కన్వీనియన్స్ స్టోర్ నడుపుతున్న 36 ఏళ్ల భారత సంతతి వ్యక్తి మైనాంక్ పటేల్ దోపిడీలో కాల్చి చంపబడ్డాడు.