Telangana Inter 1st Year Admissions : తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది.
హైలైట్:
- టీజీఆర్‌జేసీ సెట్ 2025 నోటిఫికేషన్
- మార్చి 24 నుంచి దరఖాస్తులు ప్రారంభం
- ఏప్రిల్ 23 దరఖాస్తులకు చివరితేది

అప్లయ్ చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి.. వారు పొందిన మార్కుల ప్రకారం ఆయా కాలేజీల్లో, కోర్సుల్లో సీటు కేటాయిస్తారు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ టీజీఆర్‌జేసీ 2025 ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు.. త్వరలో TGCET 2025 Results విడుదల
TS Gurukulam 5th Class Results 2025 : తెలంగాణ (Telangana) గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TGREIS విద్యాసంస్థల ఆధ్వర్యంలో 5వ తరగతిలో ప్రవేశాలకై ఉమ్మడి ప్రవేశ పరీక్ష (Telangana Gurukul CET 2025) నిర్వహించారు.
TGCET 2025 పరీక్షకు సంబంధించిన ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మార్చి నెలాఖరు లోపు TGCET 2025 Results విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలో ఫలితాల విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానుంది. విద్యార్థులు రిజల్ట్ విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం 2025 ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో TG Gurukul CET 2025 ప్రవేశ పరీక్ష నిర్వహించారు.