- గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పోస్టులకు పరీక్షలు నిర్వహించారు.
- దరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థులు- 5,51,855
- నాలుగు పేపర్లకు హాజరైన మొత్తం అభ్యర్థులు -2,49,964
- ఇన్ వ్యాలిడేటెడ్ అభ్యర్థుల సంఖ్య – 13,315
- సాధారణ ర్యాంకింగ్ జాబితా అభ్యర్థుల సంఖ్య- 2,36,649
కమిషన్ వెబ్ సైట్ లో జనరల్ ర్యాంకింగ్ జాబితా
గ్రూప్-2 పరీక్ష మాస్టర్ ప్రశ్నాపత్రంతో పాటు జనరల్ ర్యాంకింగ్ జాబితా, ఫైనల్ కీలను అందుబాటులో ఉంచాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. వీటిని 11/03/2025 నుండి 09/04/2025 వరకు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుంది. అభ్యర్థులు వారి TGPSC ID, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు అందుకున్న ఓటీపీతో వ్యక్తిగత లాగిన్‌ల నుంచి OMR షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్ కీపై తదుపరి అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం లేదు.