TGPSC Group 1 Results : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

Written by RAJU

Published on:

రీకౌంటింగ్ దరఖాస్తుకు అవకాశం

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై టీజీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. 21/10/2024 నుంచి 27/10/2024 వరకు గ్రూప్-1 సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలను టీజీపీఎస్సీ నిర్వహించింది. మొత్తం 7 పేపర్ల మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు పేపర్ల వారీగా పొందిన మార్కులను 10/03/2025 నుంచి 16/03/2025 వరకు సాయంత్రం 5.00 గంటల వరకు ఒక వారం పాటు సంబంధిత అభ్యర్థుల లాగిన్‌లో ఉంచుతారు. అభ్యర్థులు తమ TGPSC ID, మెయిన్స్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ఓటీపీ ఆధారంగా కమిషన్ వెబ్‌సైట్‌లో పేపర్ వారీగా మార్కులను పొందవచ్చు. అభ్యర్థులు మెయిన్స్ మెమోరాండం ఆఫ్ మార్క్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, నియామకం పూర్తయ్యే వరకు దానిని భద్రపరచాలని టీజీపీఎస్సీ కార్యదర్శి సూచించారు.

Subscribe for notification