హైదరాబాద్, మార్చి 10: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు సోమవారం (మార్చి 10) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఐడీ, మెయిన్స్ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి నేరుగా ప్రాథమిక మార్కుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ టీజీపీఎస్సీ చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు 7 పేపర్లకు నిర్వహించారు. ఈ పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు.
టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే..
- తొలుత టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోమ్ పేజ్‌లో కనిపించే టీజీపీఎస్సీ గ్రూప్ 1 లింక్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం లాగ్‌ఇన్ వివరాలు నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే స్క్రీన్‌పై టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మార్కుల జాబితా కనిపిస్తుంది.
- అనంతరం పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- దీనిని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా కమిషన్ తాజాగా విడుదల చేసిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో ప్రాథమిక జాబితా మాత్రమే వెల్లడించింది. అభ్యర్ధులు తమ మార్కులపై సందేహాలుంటే వచ్చే 15 రోజుల్లోగా ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున చెల్లించి రీ కౌంటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసి 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ వెల్లడిస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.