TGIIC On HCU Land Subject :ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే, హెచ్‌సీయూ ఆందోళనలపై టీజీఐఐసీ క్లారిటీ

Written by RAJU

Published on:

400 ఎకరాలపై వివాదం

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలిలో 400 ఎక‌రాల భూమి వివాదంపై తెలంగాణ పారిశ్రామిక మౌలిక వ‌స‌తుల క‌ల్పన సంస్థ (టీజీఐఐసీ) ప్రకటన విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలి గ్రామం స‌ర్వే నంబ‌ర్ 25లోని 400 ఎక‌రాల భూమిని 2004, జ‌న‌వ‌రి 13వ తేదీన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా వ‌స‌తుల అభివృద్ధికి ఐఎంజీ అక‌డ‌మీస్ భార‌త ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించింది. ఐఎంజీ అక‌డ‌మీస్ త‌న ప్రాజెక్టును ప్రారంభించ‌క‌పోవ‌డంతో 2006, న‌వంబ‌రు 21న నాటి రాష్ట్ర ప్రభుత్వం ఆ కేటాయింపును ర‌ద్దు చేసి ఏపీ యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం అండ్ క‌ల్చర‌ల్ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించింది.

Subscribe for notification
Verified by MonsterInsights