మహిళా ఓటర్లే అధికం…
కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 5,30337 మంది పురుషులు, 5.52.358 మంది మహిళలు, 61 ట్రాన్స్ జెండర్స్ మొత్తం 10,82,751 ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు జాబితాలో మహిళలే ఎక్కువగా నమోదయ్యారు. ఈసారి సైతం వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. యువత.. ఓటు నమోదుకు ముందుకు రావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.