తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం…. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. కేసీఆర్ హయాంలో వీఆర్వో వ్యవస్థ రద్దుతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా రెవెన్యూ అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులంటూ లేరు. ఈ విషయంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం….. జీపీవోను తీసుకురావాలని నిర్ణయించింది. భూమి హక్కులు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాల జారీ విచారణలు, విపత్తుల సమాచారం అందజేత, పథకాలకు అర్హుల ఎంపిక, భూ సర్వేలో సహాయం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసే కీలక బాధ్యతలను వీరు చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే… ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది.