స్లాట్ బుకింగ్ విధానం – ముఖ్యమైన అంశాలు:
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కొత్తగా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువచ్చింది.
- పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 19 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
- ఈ కొత్త విధానం ద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే అవసరం ఉండుదు. కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
- ప్రస్తుతం రాష్ట్రంలో 144 సబ్ జిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసిన కేంద్రాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత విడతలవారీగా ఈ కొత్త సేవలు అమల్లోకి వస్తాయి.
- స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ చేస్తారు. స్లాట్ బుకింగ్ చేసుకోకుండా వచ్చే వారి రిజిస్ట్రేషన్లు చేయరు.
- ప్రతిరోజూ ఉదయం 10:30 నుంచి 1:30 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.ఈ విధానంలో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను అదే రోజు కొనుగోలుదారుకు అందజేస్తారు.
- నేరుగా registration.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్దేశించిన సమయానికి నేరుగా విచ్చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.
- స్లాట్ బుక్ చేసుకోని వారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు… వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు. ఇవి 5 మాత్రమే ఉంటాయి.
- కొత్త సేవలు అందుబాటులో వచ్చిన నేపథ్యంలో అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని అనుసంధానం చేసి పని భారం సమానం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
- రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రజలు అవగాహన లేమి కారణంగా ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా దస్తావేజులు తయారు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం వెబ్‌సైట్‌లోనే ఒక మాడ్యూల్ ప్రవేశపెట్టింది. మొదటగా సేల్ డీడ్ దస్తావేజుల కోసమే ఈ సౌకర్యం ఉంటుంది. అయితే ఇది కూడా ఐచ్చికమే.
పారదర్శకంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిర్వహించడానికి ప్రభుత్వం ఈ తరహా సేవలను అమలు చేస్తోంది. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడమే కాకుండా డబుల్ రిజిస్ట్రేషన్లు కూడా కాకుండా చర్యలు చేపట్టింది.