గత 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. సంస్థకు అవసరమైన శిక్షణ నైపుణ్యమైన ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. యూనివర్సిటీని స్కిల్ జోన్ గా ఉపయోగించుకొని, ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీస్ లోనే కాకుండా, దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్ లెట్లలో ఉద్యోగాలు కల్పించాలన్నారు.