హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈఏపీసెట్ 2025 ఇంజినీరింగ్ అడ్మిట్ కార్డులను ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు వెబ్‌సైట్‌లో తమ వివరాలు పొందుపరిచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈఏపీ సెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన హాల్ టికెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణ ఈఏపీసెట్ 2025 హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆయా తేదీల్లో రోజూ రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లోని 124 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ సారి ఈఏపీసెట్ 2025 ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 2,19,420 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అగ్రికల్చర్ విభాగానికి గత ఏడాది సుమారు లక్ష మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించారు.
ఇవి కూడా చదవండి
మరో నాలుగు రోజుల్లో డిగ్రీలో ప్రవేశాలకు ‘దోస్త్ 2025’ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు మరో నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా డిగ్రీలో బకెట్ విధానం ఉంటుంది. దోస్త్ కన్వీనర్‌గా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి వ్యవహరించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.