TG DGP : తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ నియామకం

Written by RAJU

Published on:

TG DGP : తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ నియామకం
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ నియామకయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. జితేందర్‌ 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించారు. తొలుతగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాకు ఎస్పీగానూ సేవలందించారు. ఢిల్లీలో సీబీఐలో కొంతకాలం పనిచేశారు. కాగా 2025 సెప్టెంబరులో జితేందర్ పదవీవిరమణ చేయనున్నారు. దీంతో తెలంగాణ డీజీపీగా 14 నెలలపాటు కొనసాగే అవకాశం ఆయనకు ఉంది. తెలంగాణ డీజీపీగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ జితేందర్ కి సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు.

Also Read : కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా మూవీ.. క్యూరియాసిటీ పెంచుతున్న టైటిల్..

Subscribe for notification
Verified by MonsterInsights