Tesla Revenue Decline: రివర్స్‌గేర్‌లో టెస్లా

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Apr 24 , 2025 | 03:43 AM

టెస్లా జనవరి-మార్చి త్రైమాసికంలో 71శాతం నికర లాభం పతనమవడంతో పాటు వాహన విక్రయాలు 13% తగ్గాయి. ట్రంప్‌ ప్రభుత్వానికి తన సేవలను తగ్గించి టెస్లాపై దృష్టిసారించనున్నట్టు మస్క్‌ ప్రకటించారు

Tesla Profit Decline: రివర్స్‌గేర్‌లో టెస్లా

  • మార్చి త్రైమాసికంలో 71% క్షీణించిన సంస్థ లాభం

  • ట్రంప్‌ సర్కారుకు సేవలను తగ్గించుకోనున్న మస్క్‌

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహితుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన విద్యుత్‌ కార్ల కంపె నీ టెస్లా పనితీరు బాగా క్షీణించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం వార్షి క ప్రాతిపదికన 71 శాతం పతనమై 40.9 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఆదాయం 9 శాతం క్షీణించి 1,930 కోట్ల డాలర్లకు తగ్గింది. అంతేకాదు, గడిచిన మూడు నెలల్లో కంపెనీ వాహన విక్రయాలు సైతం 13 శాతం తగ్గాయి. సంస్థ పేలవ పనితీరు నేపథ్యంలో ట్రంప్‌ సర్కారుకు తన సేవలను గణనీయంగా తగ్గించుకోవడంతో పాటు టెస్లా కార్యకలాపాలపై దృష్టి పెంచాలని మస్క్‌ గట్టి నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల నుంచి ట్రంప్‌ సర్కారు కోసం కేవలం ఒకటి లేదా రెండ్రోజులు మాత్రమే కేటాయిస్తానని టెస్లా ఇన్వెస్టర్లతో అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ వ్యయాల్ని, ఉద్యోగుల్ని తగ్గించే బాధ్యతల్ని మస్క్‌కు అప్పగించారు.

ఇందుకోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (డోజే) పేరుతో ఏర్పాటు చేసిన శాఖకు ప్రస్తుతం మస్క్‌ సార థ్యం వహిస్తున్నారు. అయితే, సర్కారు కోసం మస్క్‌ పనిచేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది టెస్లా కార్ల అమ్మకాలతోపాటు పనితీరుపైనా తీవ్ర ప్రభావం చూపిం ది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెస్లా షేర్లు 41 శాతం క్షీణించాయి.

Updated Date – Apr 24 , 2025 | 03:45 AM

Google News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights