హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణలో టెన్త్ పరీక్షల ఫలితాల (Telangana 10th Results) కోసం విద్యార్థులు (Students) ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరికొద్దిసేపట్లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. దాదాపు 5 లక్షల మంది స్టూడెంట్స్ తమ రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2:15 గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే గంట 15 నిమిషాలు ఆలస్యంగా అంటే మధ్యాహ్నం 2:15 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమ టెన్త్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. ఫలితాలు విడుదలయ్యాక ఆయా వెబ్‌సైట్లలో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీ రిజల్ట్స్ మీ కళ్ల ముందుకు వచ్చేస్తాయి. ఆ వెట్ సైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వెబ్‌సైట్లు ఇవే
https://bse.telangana.gov.in
https://results.bse.telangana.gov.in
https://www.manabadi.co.in ఈ మూడు వెబ్‌సైట్లలో టెన్త్ స్టూడెంట్స్ తమ రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు.
సరికొత్త విధానం..
కాగా.. ఈసారి గ్రేడింగ్ స్థానంలో మార్కుల మెమోలపై సబ్జెక్ల వారీగా మార్కులు, గ్రేట్లను ఇవ్వనున్నారు. ఈమేరకు కొత్త మెమో నమూనాను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2009 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. ఏ-1, ఏ-2, బీ-1,బీ-2, సీ-1, సీ-2, డి, ఈలుగా గ్రేడ్‌లను ఇచ్చేవారు. సబ్జెక్ట్‌ల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ విధానాన్ని తొలగించి సీజీపీఏ కాకుండా సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించకుండానే సరికొత్త విధానాన్ని అమలు చేయడం పట్ల అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి
PM Modi: గోడ కూలి ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం..
SSC Results: మరికొద్దిసేపట్లో పదో తరగతి ఫలితాలు.. విద్యార్థుల్లో ఉత్కంఠ..
Read Latest Telangana News And Telugu News
Updated Date – Apr 30 , 2025 | 12:07 PM