tenth exams 2025,ట్రిపుల్‌ ఐటీ సీట్ల కోసం మాస్టర్‌ ప్లాన్‌.. పక్కాగా స్కెచ్‌ వేశారు కానీ.. సింపుల్‌గా దొరికిపోయిన టీచర్లు, విద్యార్థులు! – tenth exams in ap 2025 whole 6 college students debarred 16 invigilators suspended

Written by RAJU

Published on:

SSC Exams in AP 2025 : ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి. పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. అధికారులు పరీక్షల నిర్వహణ కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో..

Samayam Teluguఏపీ ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్స్‌ 2025
ఏపీ ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్స్‌ 2025

10th Exams in AP 2025 : ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగానే పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే.. మార్చి 21న జరగిన ఓ ఘటన 6 మంది విద్యార్థులను డీబార్‌ చేయడమే కాకుండా.. 15 మంది సిబ్బందిని సస్పెండ్‌ చేసేలా చేసింది. వివరాల్లోకెళ్తే.. శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలో చూచిరాతల వ్యవహారం కలకలం రేపింది. ట్రిపుల్‌ ఐటీల్లో సీట్ల కోసం టీచర్లే దగ్గరుండి విద్యార్థులతో కాపీయింగ్ చేయించారు. శ్రీకాకుళం జిల్లా పరీక్ష కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులతో అధికారులు సీరియస్‌గా స్పందించి జిల్లా విద్యాశాఖను అప్రమత్తం చేశారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగడంతో ఈ కాపీయింగ్ వ్యవహారం మొత్తం బయటపడింది.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో ఉన్న మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి పరీక్షల కోసం రెండు సెంటర్లు ఏర్పాటు చేశారు. సెంటర్ ఏలో 207 మంది, బీలో 218 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలతో నాలుగు స్క్వాడ్‌ టీమ్‌లు ఈ రెండు సెంటర్లలో తనిఖీలు చేశాయి. అక్కడ విద్యార్థులు ఆంగ్ల పరీక్షను చూసి రాస్తున్నట్లు గుర్తించారు. వీరికి సహకరించిన 15 మంది సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. అలాగే ఏ కేంద్రంలో ముగ్గురు.. బీ కేంద్రంలో ఇద్దరు విద్యార్థులను డిబార్‌ చేశారు.

కుప్పిలిలోని జెడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయులు దగ్గరుండి స్లిప్పులు తయారు చేసి ఎగ్జామ్ సెంటర్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అందజేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్‌ స్వ్కాడ్‌ ఉన్నాసరే పక్కా ప్లాన్‌తో చూచిరాతకు సహకరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు షాకయ్యారు. వీరు విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించేలా చేసే క్రమంలో ఇలా చేసినట్లు సమాచారం. మొత్తానికి పదో తరగతి పరీక్షల్లో ఈ చూచిరాత వ్యవహారం కలకలం రేపుతోంది.

అధికారులు అలర్ట్ కావడంతో ఈ వ్యవహారం బయటపడింది. సాధారణంగా ట్రిపుల్‌ ఐటీల్లో 10వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారనే విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఈ చూచిరాత మార్గాన్ని ఎన్నుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇక శుక్రవారం (మార్చి 21) జరిగిన ఇంగ్లిష్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6,20,173 మంది హాజరు కావాల్సి ఉండగా.. 6,13,487 మంది హాజరయ్యారు.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification