ABN
, Publish Date – Mar 29 , 2025 | 02:23 PM
Shravan Kumar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో శ్రవణ్ రావును ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

Shravan Kumar Rao
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మీడియా సంస్థ నిర్వాహకుడు, ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావును పోలీసులు విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. 2 గంటలుగా శ్రవణ్ రావును విచారిస్తున్నారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో శ్రవణ్ రావుకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తోంది దర్యాప్తు బృందం.
ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
ఎన్నికల సమయంలో కొందరు కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయాలనే ఆదేశాలు ఎవరి ద్వారా వచ్చేవి అని శ్రవణ్‌ను పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం వెనుక అప్పటి టాస్క్‌ఫోర్స్‌ను మీరు అప్రమత్తం చేశారా.. విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు సాంకేతిక పరికరాలు కొనుగోలు చేశారా.. ఆ ఆదేశాలు మీకు ఇచ్చింది ఎవరు.. అని ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్‌లో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు టీమ్స్ ఏర్పాటు వెనుక మీ పాత్ర ఏంటి.. ప్రభుత్వంతో ప్రత్యక్ష ప్రమేయం లేని మీరు అసలు ఫోన్ ట్యాపింగ్‌లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు.. అంటూ పలు భిన్న కోణాల్లో శ్రవణ్ రావును సిట్ బృందం విచారిస్తున్నట్లుగా వినిపిస్తోంది. ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
ప్రాణాలు కాపాడిన సెల్ ఫోన్ లైట్.
హీరోయిన్‌పై మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date – Mar 29 , 2025 | 02:26 PM