తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. తెలంగాణ వ్యాప్తంగా మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.. పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం దాదాపు నెల రోజులుగా విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు.
ఫలితాలను ఇక్కడ డైరెక్ట్‌గా చెక్ చేసుకోండి..
ఫలితాలను విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లలో కూడా ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.