- హైదరాబాద్‌లో ప్రపంచంలోని అతిపెద్ద ఎకో పార్క్
- తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన
- HCU భూముల వివాదం

CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోని అతిపెద్ద ఎకో పార్క్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పరిధిలోని 400 ఎకరాలు మాత్రమే కాకుండా, మొత్తం 1600 ఎకరాలను కూడా కలిపి 2000 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో ఈ ఎకో పార్క్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఈ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి, అన్ని భాగస్వాములతో సంప్రదింపులు జరపనుంది. ప్రస్తుతం తెలంగాణలో గచ్చిబౌలి భూముల చుట్టూ వివాదం తారాస్థాయికి చేరుకుంది. 400 ఎకరాలను సుప్రీంకోర్టు కేసు ద్వారా స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, TGIIC ఆధ్వర్యంలో ఈ భూమిని పారిశ్రామిక అభివృద్ధికి వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే, ఈ భూమిని HCU విద్యార్థులు, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు టచ్ చేయొద్దని డిమాండ్ చేస్తుండడంతో, రాజకీయంగా ఈ వివాదం ముదురుతోంది.
TGIIC ఈ వివాదంపై స్పందిస్తూ, అభివృద్ధి చేస్తున్న 400 ఎకరాల్లో HCU భూములు లేవని స్పష్టం చేసింది. 21 ఏళ్ల క్రితం ప్రైవేట్ సంస్థకు కేటాయించిన భూమిని ప్రభుత్వ న్యాయపోరాటం ద్వారా తిరిగి స్వాధీనం చేసుకుంది. 2024 జులై 19న HCU రిజిస్ట్రార్, యూనివర్శిటీ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే నిర్వహించి, హద్దులను ఖచ్చితంగా నిర్ధారించారని వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, భూవివాదం పరిష్కార మార్గాలు త్వరలో తేలనున్నాయి.
Pharmacist Death Case: మెడికల్ విద్యార్థిని నాగాంజలి కేసులో సంచలన విషయాలు..