
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మధ్య కేంద్ర నిధులపై ఆసక్తికరమైన చర్చ చోటుచేసుకుంది. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని, బీబీ నగర్ ఎయిమ్స్ వంటి ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ తరచూ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం గత పదేళ్లలో అనేక నిధులు కేటాయించిందని, తమిళనాడులో డీఎంకే డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా వెనక్కి తగ్గిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పాలనలో నడుస్తున్నాయని విమర్శించారు.
మంత్రి శ్రీధర్ బాబు సమాధానం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే తన ప్రయాణాన్ని ప్రారంభించిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా ప్రాజెక్టులు తెలంగాణకు మంజూరు చేసిందా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.
డీలిమిటేషన్ వివాదంపై వాదనలు
డీలిమిటేషన్ అంశంపై రాహుల్ గాంధీ తన స్పష్టమైన వైఖరి ప్రకటించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సమాధానంగా మంత్రి శ్రీధర్ బాబు, డీలిమిటేషన్‌పై రాష్ట్ర బీజేపీ నేతలు తమ నిర్ణయం చెప్పాలని సవాలు విసిరారు.
మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు లక్షలాది కోట్లు నిధులు అందిందని, గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా కేంద్రం అనేక నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటాను మోడీ ప్రభుత్వం 10 శాతం పెంచిందని పేర్కొన్నారు.
Long Battery Smartphones: కేవలం పదివేలలోపు ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు లిస్ట్ ఇదిగో..
Kollywood Actress : స్టార్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. చివరకు ట్విస్ట్..