తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 28, 2024 నుంచి మార్చి 19, 2024 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలిపింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్లో (www.tsbie.cgg.gov.in) ప్రకటించింది.
ఈ క్రమంలో మొదటి, రెండో సంవత్సరం విద్యార్థుల పరీక్షల తేదీలను ప్రకటించారు. అయితే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 28, 2024 నుంచి మొదలై మార్చి 18, 2024 వరకు జరగనున్నాయి. ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29, 2024న మొదలై మార్చి 19, 2024 వరకు కొనసాగుతాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.
ఇంటర్ మొదటి సంవత్సరం 2024 పరీక్షల షెడ్యూల్
సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 – ఫిబ్రవరి 28, 2024
ఇంగ్లీష్ పేపర్ 1 – మార్చి 1, 2024
మ్యాథ్స్ పేపర్ 1A/ బోటనీ పేపర్ 1/ పొలిటికల్ సైన్స్ పేపర్ 1 – మార్చి 4, 2024
మ్యాథ్స్ పేపర్ 1బి/ జువాలజీ పేపర్ 1/ హిస్టరీ పేపర్ 1- మార్చి 6, 2024
ఫిజిక్స్ పేపర్ 1/ ఎకనామిక్స్ పేపర్ 1 – మార్చి 11, 2024
కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 – మార్చి 13, 2024
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్య్ పేపర్ 1 – మార్చి 15, 2024
మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1- మార్చి 18, 2024
ఇంటర్ రెండవ సంవత్సరం 2024 పరీక్షల షెడ్యూల్
సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2- ఫిబ్రవరి 29, 2024
ఇంగ్లీష్ పేపర్ 2 – మార్చి 2, 2024
మ్యాథ్స్ పేపర్ 2A/ బోటనీ పేపర్ 2/ పొలిటికల్ సైన్స్ 2 – మార్చి 5, 2024
మ్యాథ్స్ పేపర్ 2B/ జువాలజీ పేపర్ 2/ హిస్టరీ పేపర్ 2 – మార్చి 7, 2024
ఫిజిక్స్ పేపర్ 2/ఎకనామిక్స్ పేపర్ 2 – మార్చి 12, 2024
కెమిస్ట్రీ పేపర్ 2/ కామర్స్ పేపర్ 2 – మార్చి 14, 2024
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్య్ పేపర్ 2 – మార్చి 16, 2024
మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2- మార్చి 19, 2024
Updated Date – Dec 28 , 2023 | 07:45 PM