Telangana News : తెలంగాణ ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేశారు. తాజాగా అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సెలవులపై నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే..

ఈ నేపథ్యంలో అంగన్వాడీ చిన్నారులకు, గర్భిణులకు బాలింతలు టేక్ హోం రేషన్ ద్వారా గుడ్లు సరుకులు సరఫరా చేయనున్నారు. అయితే.. ఈ వేసవి సెలవుల సమయంలో అంగన్వాడీ టీచర్లకు ఇతర విధులు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటింటి సర్వే, హోం విజిట్స్, అంగన్వాడీలో చేర్చే చిన్నారుల గుర్తింపు వంటి విధులను నిర్వర్తించాలని అంగన్వాడీ టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో వేసవి నుంచి లబ్ధిదారులకు, సిబ్బందికి ఉపశమనం కలిగినట్లయింది.
మొత్తం 14236 అంగన్‌వాడీ ఉద్యోగాలు భర్తీకి ప్రణాళిక:
మరోవైపు తెలంగాణలో గత 6-7 నెలలుగా స్తబ్ధుగా ఉన్న ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల విడుదల ప్రక్రియ నెమ్మదిగా ఊపందుకుంటోంది. ఎస్సీ వర్గీకరణ అంశం ఓ కొలిక్కి రావడంతో ఇక వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ప్రభుత్వం ఆదిశగా ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమై ఉంది. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్‌ను రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
దీంతో గ్రూప్ 1, 2, 3 ,4 పోస్టులతో పాటు పోలీసు, గురుకుల, మహిళా శిశు సంక్షేమ, హెల్త్ తదితర రిక్రూట్‌మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. అయితే.. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల కావాలి.. ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వనుంది. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేసే ఆలోచన కూడా లేకపోలేదు.
తాజా సమాచారం ప్రకారం.. తొలుత మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్ వాడీ ఉద్యోగాలు, హెల్త్ డిపార్ట్మెంట్లో 4 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లను ఏప్రిల్ నెలఖారులోగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అలాగే.. తెలంగాణ ఆర్టీసీలో 3038 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల వెల్లడించారు. ఈక్రమంలో నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. కాగా.. మిగిలిన శాఖల నుంచి ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంది.