Telangana Funds Units an Instance for the Nation, Says MLC Jeevan Reddy

Written by RAJU

Published on:

  • నలభై ఏండ్ల ప్రజా జీవితంలో ప్రగతిశీల బడ్జెట్ నిన్న చూశా
  • తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శంగా ఉంది
  • ఆర్థిక ఇబ్బందులు అధిగమించి రూపొందించారు
  • బీఆర్ఎస్ నుంచి రూ.7 లక్షల కోట్ల అప్పు
  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు
Telangana Funds Units an Instance for the Nation, Says MLC Jeevan Reddy

నలభై ఏళ్ల ప్రజా జీవితంలో ప్రగతిశీల బడ్జెట్ నిన్న చూశానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శంగా ఉందని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి బడ్జెట్ రూపొందించారని..ఎన్నికల వాగ్దానాలను కాకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఉందన్నారు. బీఆర్ఎస్ నుంచి రూ.7 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందని.. గత ప్రభుత్వం అమలు చేసిన ఏ ఒక్క కార్యకరమైనా తమ ప్రభుత్వం నిలిపివేసిందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధులో అనర్హులకు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చారని విమర్శించారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటకి లాగాలనే రుణమాఫీ చేశామన్నారు. కేసీఆర్ చేసింది వడ్డీ మాఫీ మాత్రమే అని.. రుణమాఫీ చేయలేక కేసీఆర్ చేతులు ఎత్తేశారని విమర్శించారు. ఆరు గ్యారెంటీల్లో రెండు మాత్రమే అమలు కాలేదని.. అవి కూడా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

READ MORE: Digital Arrest: 80 ఏళ్ల వృద్ధురాలు ‘‘డిజిటల్ అరెస్ట్’’.. రూ. 20 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు..

“కేసీఆర్ ఎప్పుడైనా వ్యవసాయ కూలీల గురించి ఆలోచించారా? ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉచిత విద్యుత్ వల్ల తెలంగాణలో దాదాపు ఎనభై శాతం మందికి ఉపయోగపడుతోంది. కేసీఆర్ హయాంలో ఉప ఎన్నికలు ఎక్కడొస్తే అక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ పొందిన వాళ్ళకి కూడా కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఒక సంవత్సరంలో 90 శాతం ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. దళితుల్లో ఇప్పటివరకు రిజర్వేషన్ పొందని వాళ్ళకి అవకాశం కల్పించేందుకు ఒక అడుగు వేశాం. వర్గీకరణ చేసింది రాజకీయ ప్రయోజనం కోసం కాదు. సోషల్ రెస్పాన్సిబిలిటీతోనే.” అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Subscribe for notification