లోపం ఎక్కడా.….?
ఎమ్మెల్సీ ఎన్నికతో ఉత్తర తెలంగాణలో ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం ఉందో స్పష్టమయింది. పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, హన్మకొండ, భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాలో పర్వాలేదని ఎమ్మెల్సీ ఫలితంతో స్పష్టమయింది. ఇక కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో లోపాలు కనిపించాయి. ఆయా జిల్లాల్లో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వారు సైతం సరిగా స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.